Uber Driver | 50 వేల ట్రిప్పులు పూర్తి.. హాట్‌టాపిక్‌గా ఉబ‌ర్ డ్రైవ‌ర్ నెల సంపాద‌న‌..

ఢిల్లీ (Delhi)కి చెందిన హజ్రత్ (Hajrat) అనే ఉబ‌ర్ డ్రైవ‌ర్ (Uber Driver) ఇటీవ‌లే 50,000 ట్రిప్పుల‌ను పూర్తి చేసి అద్భుత‌మైన మైలురాయిని చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉబ‌ర్‌లో త‌న జ‌ర్నీ గురించి వీడియో రూపంలో అత‌డు అంద‌రితో పంచుకున్నాడు. 'డ్రైవింగ్ విత్ ఉబర్ ఇండియా' ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియోను పోస్టు చేశారు. అత‌ని నెల సంపాద‌న ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.

Uber Driver

Uber Driver | ప్ర‌స్తుతం దేశంలో ఆన్‌లైన్ క్యాబ్ స‌ర్వీస్ ఉబ‌ర్‌, ఓలా, ర్యాపిడో వంటి సేవ‌ల‌కు డిమాండ్ పెరిగింది. చాలా మంది వీటి ద్వారానే ఆటో, క్యాబ్‌, బైక్ వంటివి బుక్ చేసుకొని గ‌మ్య‌స్థానాల‌కు చేరుకుంటున్నారు. అయితే, సాధార‌ణంగా ఉబ‌ర్ డ్రైవ‌ర్ (Uber Driver) నెల‌కు ఎంత సంపాదించొచ్చు..? రూ.20 వేల నుంచి రూ.25 వేల వ‌ర‌కూ ఉంటుంది. ఈ సంపాదన నగరం, పనిచేసే గంటలు, ఇంధన ఖర్చులు, ట్రిప్పులపై ఆధారపడి ఉంటుంది.

బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో చాలా మంది డ్రైవ‌ర్లు నెల‌కు రూ.30 వేల నుంచి రూ.60 వేల మ‌ధ్య సంపాదిస్తారు. అదికూడా రోజుకు 10 నుంచి 12 గంట‌లు ప‌ని చేస్తే ఇంత ఆదాయం పొందే అవ‌కాశం ఉంటుంది. కానీ, ఢిల్లీ (Delhi)కి చెందిన‌ ఓ ఉబ‌ర్ డ్రైవ‌ర్ నెల సంపాద‌న ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది. హజ్రత్ (Hajrat) అనే ఉబ‌ర్ డ్రైవ‌ర్ ఇటీవ‌లే 50,000 ట్రిప్పుల‌ను పూర్తి చేసి అద్భుత‌మైన మైలురాయిని చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఉబ‌ర్‌లో త‌న జ‌ర్నీ గురించి వీడియో రూపంలో అత‌డు అంద‌రితో పంచుకున్నాడు. ‘డ్రైవింగ్ విత్ ఉబర్ ఇండియా’ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆ వీడియోను పోస్టు చేశారు.

ఒక నెల‌లో రూ.1.20 ల‌క్ష‌లు..

ఆ వీడియోలో అత‌ను మాట్లాడుతూ.. త‌న‌ది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ (Uttar Pradesh) అని చెప్పాడు. తాను చ‌దువుకోలేద‌ని.. తొలుత ఓ కంపెనీలో ప‌నిచేసిన‌ట్లు చెప్పాడు. అప్పుడే త‌న ఫ్రెండ్ ఒక‌రు ఉబ‌ర్‌లో డ్రైవ‌ర్‌గా చేరొచ్చు క‌దా అని స‌లహా ఇచ్చాడ‌ట‌. అలా త‌న స్నేహితుడి ద్వారా కారు కొన్న‌ట్లు హ‌జ్ర‌త్ వివ‌రించాడు. తొలుత చ‌దువులేక‌పోవ‌డంతో లొకేష‌న్లు, ఇత‌ర సాంకేతిక విష‌యాల‌ను హ్యాండిల్ చేయ‌లేక ఇబ్బంది ప‌డిన‌ట్లు చెప్పుకొచ్చాడు. కానీ మెల్ల‌మెల్ల‌గా అన్నీ నేర్చుకున్నట్లు వివ‌రించాడు. ఇక రైడ్‌ల ద్వారా అత్య‌ధికంగా ఓ నెల‌లో తాను రూ.1,20,000 సంపాదించిన‌ట్లు చెప్పాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

నెట్టింట మిశ్ర‌మ స్పంద‌న‌

ఈ వీడియోపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ‌స్తోంది. చాలా మంది హ‌జ్ర‌త్‌ను ప్ర‌శంసిస్తుండ‌గా.. మ‌రికొంత‌మంది ఆయ‌న్ని విమ‌ర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఢిల్లీలో ఒక ఉబ‌ర్ డ్రైవ‌ర్ స‌గ‌టు నెల‌వారీ ఆదాయం సుమారు రూ.16 వేల నుంచి రూ.29 వేల మ‌ధ్య ఉంద‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. ఈ లెక్క‌న నెల‌కు రూ.1.20 ల‌క్ష‌లు ఎలా సాధ్యం అంటూ ప్ర‌శ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Yadadri Temple Brahmotsavam : లక్ష్మీ నరసింహుడికి వైభవంగా అలంకార సేవలు
Viral Video | చీర కోసం కొడుకు ప్రాణాల‌తో చెల‌గాట‌మా..?

Latest News