Inspirational Story | తాత జీవితాన్ని మార్చేసిన డయాబెటిస్.. 65 ఏళ్ల వయసులో మారథాన్ ఛాంపియన్‌గా ఎదిగిన మహిపాల్ సింగ్!

Mahipal Singh | 60 ఏళ్ల వయసులో డయాబెటిస్ మహిపాల్ జీవితాన్ని పూర్తిగా మలుపుతప్పింది. మధుమేహాన్ని కంట్రోల్ పెట్టేందుకు ప్రారంభించిన రన్నింగ్.. ఆయన్ను మారథాన్ ఛాంపియన్‌గా నిలబెట్టింది. ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల రన్నర్ కథ.. ఇప్పుడు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తోంది.

Inspirational Story | తాత జీవితాన్ని మార్చేసిన డయాబెటిస్.. 65 ఏళ్ల వయసులో మారథాన్ ఛాంపియన్‌గా ఎదిగిన మహిపాల్ సింగ్!

Inspirational Story | సాధారణంగా 60 ఏళ్లు దాటాయంటే రిటైర్‌మెంట్ జీవితాన్ని విశ్రాంతి తీసుకుంటూ గడిపోయాలని చాలామంది భావిస్తారు. పార్కుల్లో స్నేహితులతో గడుపుతూ.. మనమళ్లు మనమరాళ్లతో ఆడుకుంటూ, టీవీ చూస్తూ శేషజీవితాన్ని పూర్తి చేద్దామని అనుకుంటారు. కానీ ఈ భావనను పూర్తిగా మార్చేస్తూ ఢిల్లీకి చెందిన 65 ఏళ్ల మహిపాల్ సింగ్ అసాధారణ ఉదాహరణగా నిలిచారు. ఆరు పదుల వయసులోనూ మారథాన్‌లు, రన్నింగ్ పోటీల్లో పరుగులు తీస్తూ అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా మారారు.

ఢిల్లీకి చెందిన మహిపాల్ సింగ్ భారత నౌకాదళంలో పనిచేశారు. అనంతరం వ్యాపారం చేశాడు. జీవితమంతా సాఫీగానే సాగిపోయింది. అయితే 2021లో తన 60 ఏళ్ల వయసులో మహిపాల్ సింగ్‌ టైప్-2 మధుమేహంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. మామూలుగా ఎవరైనా డయాబెటిస్‌ వచ్చిందని తెలియగానే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ మహిపాల్ సింగ్ మాత్రం తన జీవితానికి ఇది వార్నింగ్ బెల్‌గా భావించారు. ఇలాగే ఉంటే లాభం లేదని.. తన లైఫ్‌స్టైల్ మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని భావించారు.

మధుమేహం నియంత్రణలో ఉండేందుకు డాక్టర్ల సూచన మేరకు రన్నింగ్ చేయడం మొదలుపెట్టారు. మొదట్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకే రన్నింగ్ చేసేవారు. కానీ కాలక్రమేణా అది ఆయన జీవితంలో రొటీన్‌గా మారిపోయింది. పైగా నౌకదళంలో పనిచేసినప్పటి క్రమశిక్షణ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే తన రన్నింగ్‌కు బ్రేక్ ఇవ్వలేదు. ఘజియాబాద్ వీధుల్లో ఒంటరిగా పరులు తీసేవారు. దీంతో కొద్ది నెలల్లోనే డయాబెటిస్ నియంత్రణలోకి వచ్చింది. ఫిట్‌నెస్ పెరిగింది. అలాగే తనలో ఉన్న ఎనర్జీ కూడా పెరిగినట్లు గుర్తించారు.

తన శరీరంలో వచ్చిన మార్పుతో చిన్న స్థాయి రన్నింగ్ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. నగర స్థాయి పోటీలు, జాతీయ స్థాయి మీట్‌లు, ఓపెన్ మారథాన్‌లో పాల్గొని సత్తా చాటాడు. 60 ఏళ్లు పైబడిన వయస్సు గల విభాగంలో ( మాస్టర్ అథ్లెటిక్స్‌)లో నమోదు చేసుకుని అనేక పోటీల్లో మెడల్స్ సాధించారు.

మహిపాల్ సింగ్ 2023లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మెరిశారు. దుబాయ్‌లో జరిగిన 1500 మీటర్లు, 5000 మీటర్లు, 10,000 మీటర్ల విభాగాల్లో పాల్గొని మూడింటిలోనే విన్నర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఆయన కెరీర్‌లో 150కి పైగా మారథాన్‌లు పూర్తి చేశారు. సుమారు 200 మెడల్స్, 50 ట్రోఫీలు గెలుచుకున్నారు. అలా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన్ను.. ఇండియాలో ప్రముఖ సీనియర్ అథ్లెట్‌గా నిలబెట్టింది.

Read More:

ఇదేం పోయేకాలం.. డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో శ్మశానంలో పెళ్లి చేసుకున్న జంట!

నన్ను చదువుకోమంటే.. మీ స్కూల్ కూల్చేస్తా.. టీచర్‌కే వార్నింగ్ ఇచ్చిన పిల్లాడు..!