Viral Video | చీర కోసం కొడుకు ప్రాణాలతో చెలగాటమా..?
ఓ మహిళ మూడో అంతస్తు బాల్కనీలో పడిన తన చీర (saree) కోసం తన కుమారుడి ప్రాణాలతోనే చెలగాటం ఆడింది. కొడుకు నడుముకి చీర కట్టి.. కిందకు వేలాడదీసింది (woman tied her son with a saree).
Viral Video | సాధారణంగా పిల్లల్ని తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలకు అస్సలు వెళ్లనివ్వరు. అంతేకాదు పిల్లల ప్రాణాల మీదకు వచ్చేపని చేయరు. కానీ ఓ తల్లి మాత్రం కొడుకు ప్రాణాలతో చెలగాటం ఆడింది. చీర (saree) కోసం కుమారుడిని ప్రమాదంలోకినెట్టింది.
మహిళలకు చీరలంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం పాత చీర అయినా సరే దాన్ని వదులుకునేందుకు ఇష్టపడరు. తాజాగా ఓ మహిళ కూడా అదేపనిచేసింది. నాలుగో అంతస్తులో నివాసం ఉండే ఓ మహిళ మూడో అంతస్తు బాల్కనీలో పడిన తన చీర కోసం తన కుమారుడి ప్రాణాలతోనే చెలగాటం ఆడింది. కొడుకు నడుముకి చీర కట్టి.. కిందకు వేలాడదీసింది (woman tied her son with a saree). బాలుడు కిందకు వెళ్లి చీర తీసుకున్న తర్వాత మళ్లీ అలానేపైకి లాగింది. ఏమాత్రం పట్టుతప్పినా పిల్లాడి ప్రాణం దక్కేది కాదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. వీడియో మాత్రం వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. “చీర కోసం కొడుకు ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టిన తల్లి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. “కేవలం చీర కోసం ఇంతటి సాహసమా?” అని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ చీరపోతే మరో చీర కొనుక్కోవచ్చు.. కానీ పిల్లాడికి ఏదైనా అయితే ఏంటి పరిస్థితి అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సాహసాలు ఆపండి అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
TVK Chief Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నాకు, స్టాలిన్ కు మాత్రమే
Heartwarming Friendship : దోస్త్ తోడుగా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోకి..వైరల్ ఘటన !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram