Heartwarming Friendship : దోస్త్ తోడుగా ఎంఆర్ఐ స్కాన్ మిషన్ లోకి..వైరల్ ఘటన !
ఎంఆర్ఐ స్కాన్‌కు భయపడిన బాలుడికి తోడుగా మిషన్‌లోకి వెళ్లిన స్నేహితుడు సోషల్ మీడియాలో వైరల్. నిజమైన స్నేహం అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
విధాత : ఎంఆర్ఐ స్కానింగ్ అంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా భయపడటం చూస్తుంటాం. ఆరోగ్య పరీక్షలలో భాగంగా ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ లోకి మనిషిని పంపించినప్పుడు స్కాన్ లో భాగంగా వచ్చే శబ్ధాలకు చాల మంది భయపడుతుంటారు. ఓ బాలుడు కూడా ఇదే తరహాలో ఎంఆర్ఐ స్కానింగ్ కు బెదిరిపోయాడు. తల్లిదండ్రులు, వైద్యులు ఎంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా.. అతను వినిపించుకోలేదు.
అదే సమయంలో నీతో నేను ఉంటానురా…ఏమి కాదు అన్న ఓ మాట ఆ పిల్లాడికి కొండంత ధైర్యాన్ని అందించింది. ఆ మాట…ఆ ధైర్యం చెప్పింది అతని స్నేహితుడు. నేను నీకు తోడుగా ఎంఆర్ఐ మెషిన్ లోకి వస్తాను అని చెప్పడంతో ఆ పిల్లాడు సరేనంటూ ఎంఆర్ఐ స్కానింగ్ కు ఒప్పుకున్నాడు. చెప్పిన మాట మేరకు ఆ పిల్లాడిని పట్టుకుని అతని స్నేహితుడు ఎంఆర్ఐ మెషిన్ లోపలకు వెళ్ళేదాక అండగా నిలిచాడు. ఆ స్నేహితుడి స్పర్శతో అతనికి కొండంత ధైర్యంతో ఎంఆర్ఐ స్కాన్ చేసేసుకున్నాడు. కష్టంలో నేను ఉన్నా అంటూ తన మిత్రునికి అండగా వచ్చిన ఆ బాలుడి స్నేహితుడి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మిత్రులంటే ఏదో నిత్యం ఆడుకోవడానికో లేక సినిమాలకు, షికార్లకో తిరగడానికో పరిమితమైపోతున్న నేటి రోజుల్లో.. పసిప్రాయంలోనే కష్టకాలంలో అండగా నిలబడే అత్యున్నత స్నేహితుడిగా నిలబడిన ఆ పిల్లాడి స్నేహితుడిని నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. స్నేహితుడంటే ఇలా ఉండాలని.. ఇలాంటి అరుదైన స్నేహం…ఇలాంటి స్నేహితులు ఉన్నవాళ్ళు ఎవరైన సరే గొప్పవాళ్ళు అదృష్టవంతులు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
హృదయాన్ని కదిలించిన సంఘటన ఇది.
సాధారణంగా స్నేహం అంటే కాసేపు కాలక్షేపం కోసం అంతే ఈరోజుల్లో అదేగా ఎక్కువగా జరుగుతున్నది. అవసరం కోసం అవకాశం కోసం కానీ ఈ పసి హృదయాల్లో స్నేహం అంటే ప్రాణం ఎంతలా అంటే ఇది చదవాల్సిందే.ఆ పిల్లాడికి mri స్కాన్ చాలా ముఖ్యం కానీ ఆ పిల్లవాడు భయపడుతున్నాడు,… pic.twitter.com/twsnaRL9Wy
— Uppalapati Ramvarma (@Ramvarma2025) February 23, 2026
ఇవి కూడా చదవండి :
Army Dog Tyson | మొదటి బుల్లెట్ తనకే.. అయినా మోస్ట్వాంటెడ్ను పట్టించేంతవరకు తగ్గలేదు : శునక ‘సైనికుడు’ టైసన్ వీరగాథ
Tirumala Snake Bite| తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు !
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram