Transgenders | ఫినైల్ తాగిన 25 మంది ట్రాన్స్‌జెండర్లు.. ఎందుకంటే..?
Transgenders | ఓ 25 మంది ట్రాన్స్‌జెండర్లకు( Transgenders )ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆత్మహత్యాయత్నం( Suicide Attempt ) చేశారు. వారంతా కలిసి ఫినైల్( Phenyl ) తాగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని ఇండోర్( Indore ) పట్టణంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది.

Transgenders | భోపాల్ : ఓ 25 మంది ట్రాన్స్‌జెండర్లకు( Transgenders )ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఆత్మహత్యాయత్నం( Suicide Attempt ) చేశారు. వారంతా కలిసి ఫినైల్( Phenyl ) తాగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్( Madhya Pradesh )లోని ఇండోర్( Indore ) పట్టణంలో బుధవారం రాత్రి వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్ పట్టణంలో నివాసముంటున్న ఓ 25 మంది ట్రాన్స్‌జెండర్లు బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన మహారాజా యశ్వంత్ రావు హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే 25 మంది ట్రాన్స్‌జెండర్లు ఫినైల్ తాగినట్లు తోటి వారు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ.. ఫినైల్ తాగిన ఓ 25 మంది ట్రాన్స్‌జెండర్లు బుధవారం రాత్రి ఆస్పత్రిలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే వారు ఫినైల్ ఎందుకు తాగారన్న విషయం తమకు తెలియదని డాక్టర్ పేర్కొన్నారు.
ఈ ఘటనపై డీఎస్పీ రాజేశ్ దండోతియా కూడా స్పందించారు. ట్రాన్స్‌జెండర్లు ఎందుకు ఫినైల్ తాగారన్నది విచారణ అనంతరమే తెలుస్తుందని పేర్కొన్నారు. అయితే ట్రాన్స్‌జెండర్ల మధ్య గొడవలే ఇందుకు కారణమై ఉండొచ్చని మరో పోలీసు అధికారి అన్నారు. మొత్తానికి ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.