Woman Swallows Frogs | నడుము నొప్పి భరించలేక.. 8 కప్పలను మింగిన వృద్ధురాలు..!
Woman Swallows Frogs | మీరు నడుము నొప్పి( Back Pain )తో బాధపడితే ఏం చేస్తారు..? ఆస్పత్రి( Hospital )కి వెళ్తారు.. లేదా ఇంట్లోనే జండ్ బామ్ రాసుకుని కాస్త ఉపశమనం పొందుతారు. కానీ ఈ వృద్ధురాలు మాత్రం నడుము నొప్పి నివారిణిగా సజీవంగా ఉన్న 8 కప్పలను( Frogs ) మింగి ఆస్పత్రి పాలైంది.

Woman Swallows Frogs | ఇప్పటికీ చాలా మంది అశాస్త్రీయ పద్ధతులను అవలంభిస్తున్నారు. అనారోగ్యానికి గురైతే.. ఆస్పత్రి( Hospital )కి వెళ్లాల్సింది పోయి, తాంత్రికుల వద్దకు వెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో నాటు వైద్యం చేయించుకుంటున్నారు. దాంతో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.. వింటూనే ఉంటాం. తాజాగా ఓ మహిళ( Woman ) కూడా నడుము నొప్పి( Back Pain ) భరించలేక.. ఎవరో చెప్పారని సజీవంగా ఉన్న 8 కప్పలను( Frogs ) మింగి ఆస్పత్రి పాలైంది.
వివరాల్లోకి వెళ్తే.. చైనా( China )కు చెందిన 82 ఏండ్ల వృద్ధురాలు జాంగ్( Zhang ).. గత కొంత కాలం నుంచి హెర్నియేటెడ్ డిస్క్( Herniated disc ) కారణంగా నడుము నొప్పి( Back Pain )తో బాధపడుతున్నారు. ఆ వెన్ను నొప్పిని ఆమె తట్టుకోలేకపోయారు. దీంతో స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి.. సజీవంగా ఉన్న కప్పలను( Frogs ) మింగితో నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని ఆమెకు సలహా ఇచ్చాడట.
దీంతో ఆ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులకు సజీవంగా ఉన్న కప్పలను తీసుకురావాలని కోరింది. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు 8 కప్పలను తీసుకొచ్చి ఇచ్చారు. ఒక రోజు మూడు, మరుసటి రోజు ఐదు కప్పలను మింగేసింది. ఆ తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. కడుపు నొప్పితో బాధపడుతూ నడవలేని పరిస్థితికి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వైద్యులను ఆమెను పరీక్షించగా, పరాన్నజీవి సంక్రమణను కనుగొన్నారు. ఆక్సిఫిల్ కణాలు భారీగా పెరిగినట్లు గుర్తించారు. ముఖ్యంగా కప్పలలో సాధారణంగా కనిపించే టేప్‌వార్మ్ లార్వా స్పార్గానమ్‌తో సహా ఇతర బ్యాక్టీరియా ఉనికిని వైద్యులు గుర్తించారు. దీంతో మొత్తానికి ఆ వృద్దురాలి జీర్ణ వ్యవస్థ దెబ్బతిన్నది.
మొత్తానికి వైద్యులు ఆమె ప్రత్యేక వైద్య చికిత్సను అందించారు. ఆమె ఆరోగ్యాన్ని రెండు వారాల పాటు పర్యవేక్షించారు. పూర్తిస్థాయిలో కోలుకున్న తర్వాత వృద్ధురాలిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.