iPhone 17 Pro Max | ఫోన్ కవర్ కొంటే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఉచితం.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్..
చైనాలోని జేడీ.కామ్ (JD.com) ఈ-కామర్స్ సంస్థ ఓ ఆఫర్‌ను ప్రకటించింది. ఫోన్ కవర్ (phone cover) కొంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max)ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది.
iPhone 17 Pro Max | సాధారణంగా మనం ఫోన్ కొంటే ఎయిర్‌పాడ్స్, కవర్లు, స్క్రీన్ గార్డులు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు వంటివి ఫ్రీగా ఇస్తుండటం చూశాం. మరికొందరు ఖరీదైన బ్రాండెడ్ గిఫ్ట్స్‌ను ఇస్తుంటారు. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో అయితే భారీ ఆఫర్లే అందుబాటులో ఉంటాయి. పాత ఫోన్ ఇస్తే కొంత ధర తగ్గడం, క్రెడిట్ కార్డులపై ఆఫర్లు వంటివి ఉంటాయి. అయితే, ఫోన్ కవర్ (phone cover) కొంటే లక్షలు విలువ చేసే ఐఫోన్ ఇవ్వడం ఎక్కడైనా చూశారా..? అయితే ఈ కథనం మీ కోసమే.
కవర్ కొంటే ఐఫోన్ ప్రో మ్యాక్స్ ఫ్రీ..
చైనాలోని జేడీ.కామ్ (JD.com) ఈ-కామర్స్ సంస్థ ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఫోన్ కవర్ కొంటే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (iPhone 17 Pro Max)ను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జేడీ.కామ్ ప్రకటన అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. అయితే, అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఫోన్ కవర్ ఐఫోన్‌తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ ఉండటం గమనార్హం.
ఫోన్ కవర్ ధర తెలిస్తే షాకే..
అంత ఖరీదు ఉండటానికి ఆ ఫోన్ కవర్‌లో ఏంటి అంత స్పెషల్ అని అనుకుంటున్నారు కదూ. అవునండి మీ సందేహం నిజమే. ఎందుకంటే అది బంగారంతో తయారు చేసిన కవర్ మరి. బంగారం అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆ ఫోన్ కవర్‌ను 99.99 శాతం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. 100 గ్రాముల (10 తులాల) బరువున్న కవర్ కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ ఉచిత ఐఫోన్ ఆఫర్ వర్తిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర రూ.1.50లక్షలుగా ఉంది. ఈ లెక్కన ఆ ఫోన్ కవర్ ధర సుమారు రూ.16 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ ఆఫర్ ద్వారా సంపన్న వర్గాలను, లగ్జరీ కస్టమర్లను ఆకర్షించాలని కంపెనీ భావిస్తోంది.
ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఫోన్ కోసం అంతపెట్టి కవర్ కొనాలా..? అదే డబ్బుతో 10కిపైగా ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లు వస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే.. ఆ డబ్బుతో ఇక్కడ ఓ లగ్జరీ కారే వస్తుందంటూ చెప్పుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Dil Raju | దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు… నిర్మాతలకు ఇండస్ట్రీలో విలువ లేకుండా పోయింది..
Telangana parishad elections| మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు.. లేకుంటే రూ.450కోట్ల గల్లంతే?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram