Actor Fish Venkat| ఆదుకోండి..నటుడు ఫిష్‌ వెంకట్‌ కుమార్తె విజ్ఞప్తి

Actor Fish Venkat| ఆదుకోండి..నటుడు ఫిష్‌ వెంకట్‌ కుమార్తె విజ్ఞప్తి

విధాత : తెలంగాణ యాస భాషతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన నటుడు ఫిష్‌ వెంకట్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది ఆయన కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితులలో ఫిష్ వెంకట్ కుమార్తె సాయం కోసం అభ్యర్థిస్తుంది. తన తండ్రి ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోందని, దీనస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఫిష్‌ వెంకట్‌ కుమార్తె స్రవంతి కోరుతున్నారు. నాలుగేళ్లుగా రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారని.. ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. రెండు‌ కిడ్నీలు మార్పిడి చేయాలని, ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు చెప్పినట్లు స్రవంతి తెలిపారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరుతున్నారు.

ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యలతో బాధపడుతు ఇప్పటికే 20లక్షలకు పైగా ఖర్చు చేశారు. గతంలో ఏపీ డిప్యూటి సీఎం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించడంతో వైద్య ఖర్చుల కోసం కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ప్రస్తుతం వెంక‌ట్‌ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూలో చేర్చారు కుటుంబ‌స‌భ్యులు.