Hero Prabhas| నటుడు ఫిష్ వెంకట్ కు హీరో ప్రభాస్ సహాయం

విధాత, హైదరాబాద్ : కిడ్నీలు పాడైపోయి తీవ్ర అనారోగ్యంతో ఐసీయూలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న నటుడు ఫిష్ వెంకట్ కు అవసరమైన ఆర్థిక సహాయం చేసేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ ముందుకొచ్చారు. ఫిష్ వెంకట్ కిడ్నీల మార్పిడికి సహాయం చేయాలని తను చేసిన విజ్ఞప్తికి హీరో ప్రభాస్ స్పందించినట్లుగా వెంకట్ కూతురు వెల్లడించింది. ప్రభాస్ అసిస్టెంట్ ఫోన్ చేసి ‘కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి అని..ఆపరేషన్ కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం’ అని హామీ ఇచ్చినట్లుగా ఫిష్ వెంకట్ కూతురు తెలిపింది.
కిడ్నీ మార్పిడి చేస్తే తప్ప ఫిష్ వెంకట్ బతుకడం కష్టమని ఇప్పటికే వైద్యులు చెప్పడంతో ఇందుకోసం ఆయన కుటుంబం అవసరమైన ప్రయత్నాలు చేస్తుంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!