Tirumala Snake Bite| తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు !

తిరుమలలో శ్రీవారి దర్శన క్యూలైన్లలో భక్తురాలిని పాముకాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమలలో రూ.300 దర్శన క్యూ లైన్ లో తెలంగాణలోని భూపాలపల్లి చెందిన మౌనిక (27)ను పాము కాటు వేసింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 23, 2026, 12:11 pm IST
Read Time: 2 mins
Tirumala Snake Bite| తిరుమల క్యూలైన్ లో భక్తురాలికి పాముకాటు !

విధాత : తిరుమలలో శ్రీవారి దర్శన క్యూలైన్లలో భక్తురాలిని పాముకాటు వేసిన ఘటన కలకలం రేపింది. తిరుమలలో రూ.300 దర్శన క్యూ లైన్ లో తెలంగాణలోని భూపాలపల్లి చెందిన మౌనిక (27)ను పాము కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది.. ఆమెను అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం మౌనిక కోలుకుందని..ఎలాంటి ప్రాణాపాయం లేదని టీటీడీ అధికారులు ప్రకటించారు.

అడవులు, కొండలతో కూడిన ఏడుకొండలవాడి పుణ్యక్షేత్రం తిరులమలో క్యూలైన్లు సహా తిరుమల వ్యాప్తంగా తరచూ పాములు, జంతువుల సంచారం కొనసాగుతుంటుంది. వాటిని సిబ్బంది వెంటనే రెస్క్యూ చేసి.. అనంతరం అడవుల్లో వదలిపెడుతూ ఉంటారు. ఎక్కడైనా పాములు సహా.. జంతువులు ఎక్కడైనా కనిపిస్తే.. వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వాలని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.