అలరించిన చిన్నారుల చిత్ర కళాసంత…సృజనాత్మకత వెలికి తీసేందుకు యత్నం

తెలుగు రాష్ట్రాల నుండి 436 మంది చిన్నారులు పాల్గొన్నారు. వారం రోజులు వేసిన చిత్రాలు, క్రాఫ్ట్ వర్క్ లు అన్ని ఒకే చోట పోగేసి చిన్నారుల చిత్ర కళా సంత పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ శనివారం వేములవాడ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో, కరీంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంకమ్మ తోటలో, ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ళ వేణు మాధవ్ ఆడిటోరియం లో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు.

విధాత, వరంగల్ ప్రతినిధి : సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో వారం పాటు సాగంటీస్ ఆర్ట్ చాలెంజ్ నిర్వహించగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి 436 మంది చిన్నారులు పాల్గొన్నారు. వారం రోజులు వేసిన చిత్రాలు, క్రాఫ్ట్ వర్క్ లు అన్ని ఒకే చోట పోగేసి చిన్నారుల చిత్ర కళా సంత పేరిట ఆర్ట్ ఎగ్జిబిషన్ శనివారం వేములవాడ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో, కరీంనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మంకమ్మ తోటలో, ఆదివారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని నేరెళ్ళ వేణు మాధవ్ ఆడిటోరియం లో చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు, ఆర్టిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని చిత్రాలను తిలకించారు. పెద్దల నుండి అందిన ప్రశంసలకు చిన్నారులకు ఆనందం, వారి తల్లిదండ్రులకు సంతోషం, ఒక్కసారే అందాయి.. చిన్నారుల్లో ఇంత ప్రతిభ ఉందా అని చూసిన వారంతా అభినందించారు.

ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ప్రదర్శన… అనంతరం అకాడమీ డైరెక్టర్ డా. మంజుల సాగంటి పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారి ఆర్టిస్టు ను కండువాతో సన్మానించి సర్టిఫికెట్, ట్రోఫీ, గోల్డ్ మెడల్ అందించి వారిలోని ప్రతిభను మరింత మెరుగు పరుచుకునేలా ప్రోత్సహించి చిన్నారులను ఆనందింపజేశారు.. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని, పిల్లల్లోని సృజనాత్మకత వెలికి తీసేలా చేసే ఇలాంటి వాటి వల్ల పిల్లల్లోని ఏకాగ్రత కూడా పెరుగుతుందని వీక్షకులు కొనియాడారు.. ప్రముఖ చిత్రకారుడు చిప్పకుర్తి శ్రీనివాస్, అకాడమీ సలహాదారుడు నిమ్మల శ్రీనివాస్, హరిప్రసాద్ రావు, హరిప్రియ, ఆర్టిస్ట్ శిరీష, దేవిక, జయశ్రీ, రఘుపతి, హేమలత, కవిత, మానస, సంజన, సాయి, వెన్నెల, వర్ష, షైనీ ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఈ సందర్భంగా మంజుల వచ్చిన వారందరికీ కృతఙ్ఞతలు తెలిపారు.

 

Latest News