Chicken Price | కొండెక్కిన కోడి కూర ధ‌ర‌.. కిలో రూ. 350 పైనే..!

Chicken Price | రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ధ‌ర‌లకు రెక్కలొచ్చాయి. గ‌త నాలుగైదు రోజుల నుంచి చికెన్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు కొన‌లేని స్థాయికి చికెన్ ధ‌ర‌లు చేరాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ వంటి జిల్లాల్లో కిలో చికెన్ ధ‌ర రూ. 350పైనే ప‌లుకుతోంది.

  • By: raj |    telangana |    Published on : May 13, 2026 7:30 AM IST
Chicken Price | కొండెక్కిన కోడి కూర ధ‌ర‌.. కిలో రూ. 350 పైనే..!

Chicken Price | రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ ధ‌ర‌లకు రెక్కలొచ్చాయి. గ‌త నాలుగైదు రోజుల నుంచి చికెన్ ధ‌ర‌లు ఆకాశాన్నంటాయి. సామాన్యుడు కొన‌లేని స్థాయికి చికెన్ ధ‌ర‌లు చేరాయి. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్ వంటి జిల్లాల్లో కిలో చికెన్ ధ‌ర రూ. 350పైనే ప‌లుకుతోంది.

వేడి గాలుల తీవ్ర‌త‌తో పాటు పెళ్లిళ్ల సీజ‌న్ కార‌ణంగా కోడి కూర ధ‌ర‌లు భారీగా పెరిగిపోతున్నాయి. వేస‌వి తీవ్ర‌తతో పౌల్ట్రీల‌లో కోళ్లు చ‌నిపోతున్నాయి. దీంతో డిమాండ్‌కు త‌గ్గ స‌ర‌ఫ‌రా లేదు. ఉన్న కోళ్ల ధ‌ర‌ల‌ను కూడా పెంచి సొమ్ము చేసుకుంటున్నారు య‌జ‌మానులు.

హైద‌రాబాద్ న‌గ‌రంలోనే చికెన్ ధ‌ర‌లు 16 శాతానికి పైగా పెరిగాయి. వారం రోజుల క్రితం వ‌ర‌కు కిలో చికెన్ ధ‌ర రూ. 250 నుంచి రూ. 300 మ‌ధ్య ప‌లికింది. ప్ర‌స్తుతం రూ. 350 నుంచి రూ. 370 మ‌ధ్య ప‌లుకుతోంది కిలో చికెన్ ధ‌ర‌.

స్కిన్‌తో కూడిన చికెన్, స్కిన్‌లెస్ చికెన్, లైవ్ చికెన్ ధ‌ర‌లన్నింటిల్లోనూ స్ప‌ష్ట‌మైన పెరుగుద‌ల క‌నిస్తుంది. లైవ్ చికెన్ ధ‌ర కిలోకు రూ. 190 నుంచి రూ. 220 మ‌ధ్య ఉంది. బోన్ లెస్ చికెన్ ధ‌ర రూ. 500గా ఉంది.

35 డిగ్రీల ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోతున్న కోళ్లు :

వర్షాకాలం, చలికాలం కోడి పిల్లల ఉత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఎండాకాలం వచ్చేసరికి మాత్రం అధిక ఉష్ణోగ్రతలను బాయిలర్ కోళ్లు తట్టుకోవడం లేదు. ఎండ వేడిమి, ఉక్కపోత తట్టుకోలేక మృత్యువాతపడుతున్నాయి. ఇలా కోళ్లు చనిపోకుండా ఉండేందుకు ఫారాల చుట్టూ జాలీలకు తట్లు ఏర్పాటు చేసి, వాటిపై నీళ్లు చల్లుతుంటారు. అయినా ఆ ప్రయత్నాలు ఫలితమివ్వడం లేదు.