Airport | ఆదిలాబాద్ ఏయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు భూసేకణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్‌లో 700 ఎకరాల భూసేకరణ చేపట్టాలని కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చేసిన సాంకేతిక–ఆర్థిక అధ్యయన నివేదికను ఆధారంగా తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణకు అనుమతి ఇచ్చింది.

Due To Us Governmnet Shutdown air controller shortage and flight delays

విధాత, హైదరాబాద్ :

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు భూసేకణకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆదిలాబాద్‌లో 700 ఎకరాల భూసేకరణ చేపట్టాలని కలెక్టర్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) చేసిన సాంకేతిక–ఆర్థిక అధ్యయన నివేదికను ఆధారంగా తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం భూ సేకరణకు అనుమతి ఇచ్చింది. ఏర్ పోర్టు నిర్మాణానికి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుందని దాని కోసం భూసేకరణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భూమిని రైటల్ అండ్ బిల్డింగ్స్ (ఎయిర్‌పోర్ట్స్) విభాగం ద్వారా జిల్లా కలెక్టర్‌ కు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం సేకరించాల్సి ఉంటుంది. ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రాంతీయ విమాన సదుపాయాన్ని పెంచడం, స్థానిక అభివృద్ధి, వ్యాపారం, సౌకర్యాలు మెరుగ్గా చేయడం కోసం ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.

మహారాష్ట్రకు దగ్గరగా ఉండడంతో ఆదిలాబాద్ లో ఏయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. కాగా, జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో గతంలోనే సర్వే నిర్వహించిన 369 ఎకరాల భూమిలో చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని భావించారు. అయితే భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో భారీ విమానాశ్రయాన్ని నిర్మించాలని ఏఏఐ నిర్ణయించడానికి ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం 700 ఎకరాల స్థల సేకరణకు నాంది పలికింది. ఓవైపు విమానాశ్రయం.. మరోవైపు భారతీయ వాయుసేన (ఐఏఎఫ్) స్టేషన్ ను ఇక్కడ నిర్మించాలని ఏఏఐ నిర్ణయం తీసుకుంది.