చేవెళ్ల లో బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ 20 మంది మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 20 మంది దుర్మరణం చెందారు మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

విధాత : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 20 మంది దుర్మరణం చెందారు మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి.  రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో సోమ‌వారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ప్రయాణిస్తున్న టిప్పర్ లారీ, 70 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా.. 24 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంతో చేవెళ్ల–వికారాబాద్‌ మార్గంలో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. టిప్పర్ లారీ కంకర తో సహా బస్సు మీద పడిపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. మృతుల్లో 10 నెలల చిన్నారి కూడా ఉండటం విషాదం రేపింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నారు.