న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో ఘోర బస్సు ( Uttarakhand Almora bus accident) ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంంలో ఏడుగురు చనిపోగా(seven killed), పలువురు గాయపడ్డారు. వారిలో 11 మంది పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భిక్యాసేన్ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బస్సు భిక్యాసేన్ ప్రాంతం నుండి రామ్‌నగర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
గత నవంబర్ నెలలో ఉత్తరాఖండ్‌లోని ఇదే అల్మోరా జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 36 మంది మృతి చెందగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పుడు కూడా బస్సు లోయలో పడిపోవడంతో ప్రమాదంలో అధిక ప్రాణ నష్టం సంభవించింది. సుల్ట్ తహశీలల్‌లోని మార్చులా ప్రాంతంలోని కూపి గ్రామ సమీపంలో ఈ విషాదం సంభవించింది.
