wedding | ప్రేమ కేవలం రెండు అక్షరాలు మాత్రమే కాదు. రెండు మనస్సుల కలయిక. ఈ ప్రేమకు కుల, మత, ప్రాంతం అన్న బేధాలు ఉండవు. మనసులు, అభిప్రాయాలూ కలుస్తే చాలు. మనుషుల్ని ఎంతదూరమైనా తీసుకెళ్తుంది. తాజాగా ఫ్రాన్స్‌కు చెందిన ఓ యువకుడితో ఉత్తరాఖండ్ అమ్మాయి వివాహం గ్రాండ్‌గా జరిగింది.
స్నేహం కాస్తా.. ప్రేమగా మారి
వీరిద్దరి కులాలు వేరు.. మతాలు వేరు.. సంప్రదాలు వేరు. కానీ ప్రేమ వారిని ఒక్కటి చేసింది. ఖండాలు దాటేలా చేసింది. ఉత్తరాఖండ్ (Uttarakhand) అల్మోరా (Almora)కు చెందిన శ్రీపూర్ణ జోషి (Shreepurna Joshi) ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తోంది. అక్కడ ఆమెకు ఒహేల్వై (Ohelail) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహంగా మెలిగిన వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరు మనసులు, అభిప్రాయాలు కలిశాయి. దీంతో కొన్ని రోజులు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఇక వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అల్మోరా వేదికగా..
ఓ రోజు తమ ప్రేమ వ్యవహారం ఇద్దరూ ఇంట్లో చెప్పారు. ఇద్దరూ మంచి స్థాయిలో ఉండటంతో ఇరు కుటుంబ సభ్యులూ వీరి ప్రేమకు అడ్డు చెప్పలేదు. పెళ్లికి అంగీకరించారు. ఇక వీరి వివాహానికి అల్మోరా వేదికైంది. వధువు కుటుంబ సభ్యులు పెళ్లిని భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చాలా గ్రాండ్‌గా చేశారు. అల్మోరాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కౌసార్ దేవి రిసార్ట్ (Kausar Devi Resort)లో ఈ వేడుక జరిపించారు.
హిందూ సంప్రదాయం ప్రకారం..
వీరి వివాహం హిందూ సంప్రదాయం (Hindu traditions) ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు వరుడి కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ జంట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన పలువురు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Papaya Benefits | బొప్పాయితో బోలెడు లాభాలు..! మరి షుగర్ పేషెంట్లు తినొచ్చా..?
Youtuber | యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ పెరగలేదని.. రూ.10 లక్షల విలువైన స్టూడియోకే నిప్పు
