Papaya Benefits | బొప్పాయితో బోలెడు లాభాలు..! మరి షుగర్ పేషెంట్లు తినొచ్చా..?
Papaya Benefits | పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతారు. కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్తోనే మంచి ఆహారం తీసుకునేందుకు సిద్దమవ్వాలి.
Papaya Benefits | పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటేనే.. ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనారోగ్యానికి గురవుతున్నారు. వివిధ రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతారు. కాబట్టి ఉదయం బ్రేక్ఫాస్ట్తోనే మంచి ఆహారం తీసుకునేందుకు సిద్దమవ్వాలి. బ్రేక్ఫాస్ట్లో తేలికపాటి ఆహారం తీసుకుంటే రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఎనర్జీటిక్గా కూడా ఉంటారు. మరి మార్నింగ్ వేళ తేలికపాటి ఆహారం ఏదైనా ఉందా..? అంటే అది బొప్పాయి పండు అని చెప్పొచ్చు. బొప్పాయిని తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
రోగ నిరోధక శక్తికై
బొప్పాయి పండులో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బొప్పాయిలో ప్రధానంగా విటమిన్ సీ, విటమిన్ ఏ విరివిగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించి, ఎలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా చేస్తాయి. సీజనల్ వ్యాధులు కూడా సంభవించే ప్రమాదం లేదు.
బరువు తగ్గాలనుకునే వారికి..
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పండులో తక్కువ కేలరీలతో ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో బొప్పాయిని తినడం.. కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో మధ్యాహ్నం అతిగా తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి బెస్ట్.
జీర్ణక్రియ మెరుగుపడేందుకు..
జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని తింటే చాలా వరకు సమస్యను అధిగమించినట్టే. ఈ పండులో ఉండే పాపైన్.. ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసేందుకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది.
గుండె ఆరోగ్యం కోసం
ఇటీవలి కాలంలో చాలా మంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. గుండె నొప్పికి గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. బొప్పాయిని మెనూలో భాగం చేసుకుంటే చాలా వరకు గుండె సమస్యలను అధిగమించొచ్చు. బొప్పాయిలో ఉండే ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు ఇది సహాయపడుతుంది.
షుగర్ ఉన్నవారు తీసుకోవచ్చా?
నిపుణుల సూచన ప్రకారం బొప్పాయిని పరిమిత మోతాదులో డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకుండా జాగ్రత్త అవసరం.
ఎలా తింటే మంచిదంటే..
ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు పండిన బొప్పాయి తింటే సరిపోతుంది. కొందరు రుచికోసం ఉప్పు, చక్కెర వేసుకుని తింటారు. కానీ అలా కాకుండా నేరుగా బొప్పాయిని తినడం మంచిది. బొప్పాయి తిన్న తర్వాత 20–30 నిమిషాల వరకు ఇతర ఆహారం తీసుకోకపోవడం మంచిది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram