Weigh Loss | బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!

Weigh Loss | బరువు తగ్గడం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది లక్ష్యంగా మారింది. దీనికోసం రకరకాల డైట్‌లను పాటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే రోజుకో కొత్త రకం డైట్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో వెయిట్ లాస్‌ కోసం ఓ వింత ట్రైండ్ ఫాలో అవుతున్నారు.

Weigh Loss | బరువు తగ్గేందుకు వింత ట్రెండ్.. ప్లాస్టిక్ కవర్లు నములుతున్న యూత్!

Weigh Loss | బరువు తగ్గడం అనేది ఈ మధ్యకాలంలో చాలామంది లక్ష్యంగా మారింది. దీనికోసం రకరకాల డైట్‌లను పాటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే రోజుకో కొత్త రకం డైట్‌లు కూడా పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనాలో వెయిట్ లాస్‌ కోసం ఓ వింత ట్రైండ్ ఫాలో అవుతున్నారు.

చైనాలో ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతున్న ఆ డైట్ పేరు “క్లింగ్ ర్యాప్ డైట్”. ఈ పద్ధతిలో ముందుగా ఒక ప్లాస్టిక్ కవర్ (క్లింగ్ ఫిల్మ్)ను నోటిలో పెట్టుకుంటారు. ఆ తర్వాత వాళ్లు తినాలని అనుకునే ఆహారాన్ని ఆ కవర్‌లో ఉంచి బాగా నములుతారు. అనంతరం దాన్ని మింగకుండా మొత్తం బయటకు ఉమ్మివేస్తారు. ఇలా చేస్తే తాము భోజనం చేసినట్లుగా మెదడు భావించి ఆకలి తగ్గుతుందని వారు భావిస్తున్నారు. దీనివల్ల కేలరీలు శరీరంలోకి వెళ్లవని.. తద్వారా బరువు తగ్గవచ్చని ప్రచారం చేస్తున్నారు. దీన్ని కేలరీ ఫ్రీ వెయిట్ లాస్ హ్యాక్ అంటూ సోషల్‌మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు.

చైనాలో వైరల్ అవుతున్న ఈ వింత డైట్‌పై ఆరోగ్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పద్ధతి శారీకంగానే కాకుండా మానసికంగానూ తీవ్రమైన ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్‌లో ఆహారాన్ని నమిలే సమయంలో మైక్రో ప్లాస్టిక్ కణాలు లాలాజలం ద్వారా గొంతులోకి వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. తద్వారా ఇది జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశంలో చేరి దీర్ఘకాలిక వాపు, కడుపు ఉబ్బరం, వికారం, పొట్ట నొప్పి వంటి సమస్యలకు కారణమవుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా కాలేయం, కిడ్నీ, పేగుల పనితీరుపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

జీర్ణ, శ్వాస కోశ సమస్యల కాకుండా నోటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ ర్యాపర్‌లో ఆహారం ఉండటం వల్ల బలంగా నమలాల్సి వస్తుందని.. దానివల్ల దందాల ఎనామెల్ దెబ్బతింటుందని.. పళ్లలో పగుళ్లు ఏర్పడవచ్చని, చిగుళ్ల గాయాలు, రక్తస్రావం వంటి సమస్యలు రావచ్చని అంటున్నారు. ప్లాస్టిక్‌లో బ్యాక్టీరియా చిక్కుకుపోవడం వల్ల ఇన్‌ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఈ ట్రెండ్ మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు. చూ అండ్ స్పిట్ అలవాటు బులీమియా, అనోరెక్సియా వంటి ఈటింగ్ డిజార్డర్లకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆహారం రుచి మాత్రమే ఆస్వాదించి, కేలరీలు తీసుకోకుండా ఉండాలనే ఆలోచన మానసిక ఒత్తిడిని పెంచుతుందని.. తద్వారా ఆందోళన, డిప్రెషన్, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చని అంటున్నారు. బరువు తగ్గాలంటే ఇలాంటి వింత ట్రెండ్‌లు ఫాలో అవ్వడం కంటే.. సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ వ్యాయమం చేయడం, మంచి నిద్ర ఒక్కటే సరైన మార్గమని సూచిస్తున్నారు.

Read More:

Monkey | ఎర్ర మట్టిని తినడం అలవాటు చేసుకుంటున్న కోతులు.. టూరిస్టులు ఇచ్చే జంక్‌ఫుడ్ వల్లేనా?

గుడ్డు కాదు.. గాడిద గుడ్డూ కాదు.. ‘బంగారు గుడ్డు’ రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు..