Youtuber | యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ పెరగలేదని.. రూ.10 లక్షల విలువైన స్టూడియోకే నిప్పు
జార్ఖండ్ (Jharkhand)కు చెందిన ఓ యువకుడు తనకు యూట్యూబ్ (Youtube)లో సబ్‌స్క్రైబర్స్ పెరగలేదన్న మనస్థాపం చెందాడు (YouTuber Fails To Get Followers). ఈ క్రమంలో రూ.10 లక్షల విలువైన స్టూడియోకి నిప్పు పెట్టాడు (Sets Studio On Fire).
Youtuber | సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు జనాలు ఎగబడుతున్నారు. రీల్స్, వీడియోలు చేస్తూ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజాగా ఓ యువకుడు చేసిన పని అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. యూట్యూబ్‌లో (Youtube) సబ్‌స్క్రైబర్లు పెరగకపోవడంతో మనస్తాపం చెందిన యువకుడు.. ఏకంగా ఇంట్లో ఉన్న స్టూడియోకే నిప్పు పెట్టాడు. ఈ ఘటన జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఫలితం దక్కకపోవడంతో నిరాశ..
గర్హ్వా (Garhwa) జిల్లాకు చెందిన 27 ఏళ్ల యువకుడు విధాయక్ ప్రజాపతి.. తన నివాసంలో ఓ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నాడు. ఫిల్మ్ ఎడిటింగ్, డిజిటల్ వర్క్ చేస్తున్నాడు. అయితే, అతడికి యూట్యూబ్ ద్వారా పాపులర్ అవ్వాలన్న కోరిక ఉంది. అందుకోసం తన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని అమ్మేసి ఓ స్టూడియోను నిర్మించుకున్నాడు. అయితే నెలల తరబడి శ్రమించినా సరైన ఫలితం రాలేదు. అతడి యూట్యూబ్ ఛానెల్‌కు సబ్ స్క్రైబర్లు పెరగలేదు (YouTuber Fails To Get Followers). దీంతో అతను తీవ్ర నిరాశతో మనస్థాపానికి గురయ్యాడు. గత వారం రోజులుగా అదే బాధలో ఒంటరిగా గడుపుతున్నాడు.
స్టూడియోకి నిప్పు..
ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో అతడు ఎవరూ ఊహించని పని చేశాడు. స్టూడియోలోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. ఆ తర్వాత దానికి నిప్పుపెట్టాడు (Sets Studio On Fire). ఇల్లంతా పొగతో నిండిపోవడంతో కుటుంబ సభ్యులు లోపలే ఇరుక్కుపోయారు. లోపల నుంచి తాళం వేసిన ఇనుప తలుపు కారణంగా వారు బయటకు రాలేకపోయారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇటి పక్క గోడను పగలగొట్టి వారిని రక్షించారు.
ఖరీదైన పరికరాలు ధ్వంసం..
ఈ ప్రమాదంలో స్టూడియోలోని ఖరీదైన కంప్యూటర్లు, కెమెరాలు, సౌండ్ సిస్టమ్‌లు, లైటింగ్ పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షలకు పైగా విలువైన పరికరాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కుటుంబానికి ఉన్న ఒక్క ఆధారం భూమిని అమ్మేసి ఆ స్టూడియోని నిర్మించాడు. దానికే నిప్పు పెట్టడంతో ప్రజాపతి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. మరోవైపు పోలీసుల రాకతో అతడు తప్పించుకుని పారిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని మానసిక వైద్య చికిత్స నిమిత్తం రాంచీలోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
సొంతింటికి నిప్పుపెట్టుకోవాలా..?
ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వ్యూస్ రాకపోతే.. సొంత ఇంటికే నిప్పు పెట్టుకోవాలా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది గానీ, ఇలా చేస్తే నష్టం తప్ప ఏమీ మిగలదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Vijay – Rashmika | ప్రైవసీకే ప్రాధాన్యం .. అన్ని కోట్ల ఆఫర్ ఇచ్చిన పెళ్లి వీడియో డీల్‌కు ‘నో’ చెప్పిన విజయ్- రష్మిక జంట
Elderly Woman | ఫుట్‌పాత్‌పై వాహనం నడిపేందుకు యత్నించిన బైకర్‌ను ధైర్యంగా అడ్డుకున్న వృద్ధురాలు.. VIDEO
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram