Vijay – Rashmika | ప్రైవసీకే ప్రాధాన్యం .. అన్ని కోట్ల ఆఫ‌ర్ ఇచ్చిన‌ పెళ్లి వీడియో డీల్‌కు ‘నో’ చెప్పిన విజయ్- రష్మిక జంట‌

Vijay - Rashmika | టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే అంశం అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి రేపుతోంది.

  • By: sn |    movies |    Published on : Feb 13, 2026 12:55 PM IST
Vijay – Rashmika | ప్రైవసీకే ప్రాధాన్యం .. అన్ని కోట్ల ఆఫ‌ర్ ఇచ్చిన‌ పెళ్లి వీడియో డీల్‌కు ‘నో’ చెప్పిన విజయ్- రష్మిక జంట‌

Vijay – Rashmika | టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే అంశం అభిమానుల్లో ఎప్పటినుంచో ఆసక్తి రేపుతోంది. రౌడీ హీరో, నేషనల్ క్రష్ వెడ్డింగ్ అంటే అది ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద ఈవెంట్‌గా మారడం ఖాయం. అయితే ఈ పెళ్లి వేడుక చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఇటీవల స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్లు ఒక పెద్ద బిజినెస్ డీల్‌లా మారిపోతున్నాయి. పెళ్లి షూటింగ్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తుండటం కామన్ అయిపోయింది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకూ చాలా మంది స్టార్‌లు తమ వెడ్డింగ్ వీడియోలను డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కి విక్రయించిన ఉదాహరణలు ఉన్నాయి. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ, అలాగే నయనతార వంటి ప్రముఖులు ఈ ట్రెండ్‌ను ఫాలో అయ్యారు.

కానీ విజయ్–రష్మిక జంట మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కోసం ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ ఇచ్చిన భారీ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 60 కోట్లు ఆఫర్ చేసినా, వ్యక్తిగత జీవితాన్ని వ్యాపార కోణంలో చూడడం తనకు ఇష్టం లేదని, పెళ్లి అనేది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగే ప్రైవేట్ వేడుకగానే ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయం వెనుక గతంలో నయనతార వెడ్డింగ్ వీడియో స్ట్రీమింగ్ సమయంలో తలెత్తిన వివాదాలు కూడా ఒక కారణమై ఉండవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి. న్యాయపరమైన చిక్కులు, కాపీరైట్ సమస్యలు వంటి అంశాలు ఎదురైన నేపథ్యంలో అలాంటి తలనొప్పులు తమకు అవసరం లేదని విజయ్–రష్మిక జంట భావిస్తున్నారట. కమర్షియల్ యాంగిల్ కంటే ప్రైవసీకి విలువ ఇవ్వడం అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది.

విజయ్ దేవరకొండ తన లైఫ్ స్టైల్ విషయంలో ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉండే వ్యక్తి. బయట రౌడీ ఇమేజ్ ఉన్నా, కుటుంబ విషయాల్లో మాత్రం ఎంతో సెన్సిటివ్‌గా ఉంటారు. రష్మిక కూడా ఇదే అభిప్రాయంతో ఉండటంతో ఓటీటీ సంస్థకు నిరాశ తప్పలేదని ప్రచారం. డబ్బు కోసం వ్యక్తిగత క్షణాలను పబ్లిక్ చేయడం కంటే, ఆ జ్ఞాపకాలను తమలోనే దాచుకోవడం మంచిదని ఈ జంట భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికీ పెళ్లి విషయంపై అధికారిక ప్రకటన రాకపోయినా, అభిమానులు మాత్రం ఈ జంటను పెళ్లి బట్టల్లో చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్‌గా జరిగినా ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు వస్తే సోషల్ మీడియా షేక్ కావడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి డీల్స్ లేకపోయినా, హైప్ మాత్రం తగ్గడం లేదు.