విధాత : ఫ్రెంచ్ రాజధాని పారిస్ నగరానికి గుర్తింపుగా నిలిచి..పర్యాటక కేంద్రంగా కొనసాగుతున్న ఈఫిల్ టవర్ తాజాగా ఓ అద్బుత ఘటనకు వేదికైంది. పారిస్ లో తాజా వర్షాల క్రమంలో రాత్రిపూట ఈఫిల్ టవర్‌పై ఓ శక్తివంతమైన పిడుగు పడింది. పిడుగు పాటు కాంతితో పారిస్ నగరం అద్భుతంగా వెలిగిపోతున్న దృశ్యంతో కూడిన 6-సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వీడియోలో ఈఫిల్ టవర్ పై పిడుగు పడిన సందర్బంలో ఆకాశంలో విరజిమ్మిన కాంతిరేఖ మెరుపులతో పారిస్ నగరం అద్బుతంగా వెలిగిపోతూ కనిపించింది. జూన్ 28, 2026న పారిస్ నగరంలో ఉరుములతో కూడిన తుఫానుల సమయంలో జరిగిన ఈ అద్భుత దృశ్యం వీడియో సోషల్ మీడియాలో దూసుకపోతుంది. ఈఫిల్ టవర్‌పై సగటున సంవత్సరానికి ఐదుసార్లు పిడుగులు పడతాయని, విద్యుత్తును సురక్షితంగా భూమిలోకి పంపే సేఫ్ రాడ్లు దీనిలో అమర్చబడి ఉన్నాయని ఆ దేశ నిపుణులు వెల్లడించారు.
పారిస్ నగరాని తలమానికంగా నిలిచే ఈఫిల్ టవర్ మొత్తం ఎత్తు సుమారు 330 మీటర్లు. పర్యాటకులు సందర్శించడానికి వీలుగా ఈ టవర్‌లో మొత్తం మూడు ప్రధాన ఫ్లోర్లను నిర్మించారు. ప్రతి ఫ్లోర్ దేనికదే ప్రత్యేకతను కలిగి ఉంటుంది. బయటి నుంచి ఎంత భారీగా కనిపిస్తుందో, లోపల కూడా అంతే అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. నగరంలోని సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప ఈ గోపురం ప్రపంచంలో అత్యంత ఎత్తైన నిర్మాణాలలో ఒకటిగా నిలిచింది. ఫ్రెంచ్ విప్లవ శతాబ్ది వార్షికోత్సవానికి ప్రతీకగా 1889లో దీనిని నిర్మించారు. దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి “ఈఫిల్ టవర్” అని పేరు వచ్చింది. ఈఫిల్ టవర్ మొత్తం బరువు 10,000 టన్నులు కాగా, అందులో లోహపు బరువు 7,300 టన్నులు. ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు.
ఈఫిల్ టవర్‌ను తాకిన భారీ పిడుగు.
అద్భుతమైన కాంతిరేఖతో వెలిగిపోయిన పారిస్.#EiffelTower #Paris #UANow #lightningbolt #UANow pic.twitter.com/6Qp43frRP1— UttarandhraNow (@UttarandhraNow) June 28, 2026