Sridevi | ల‌వ్ గురించి మాట్లాడితే మా మమ్మీ తంతుంది… ‘బ్యాండ్ మేళం’తో నవ్వులు–కన్నీళ్లు గ్యారంటీ: శ్రీదేవి

Sridevi | గతేడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కోర్ట్ చిత్రం యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో నాని సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్ – శ్రీదేవి అపల్లా జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. “కథలెన్నో చెప్పారు ప్రేమలో” అంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి తెరపై కనిపించబోతుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.ఈ క్యూట్ కాంబో రిపీట్ అవుతున్న కొత్త చిత్రం బ్యాండ్ మేళం

Sridevi | గతేడాది చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కోర్ట్ చిత్రం యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో నాని సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్ – శ్రీదేవి అపల్లా జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. “కథలెన్నో చెప్పారు ప్రేమలో” అంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ జంట ఇప్పుడు మరోసారి కలిసి తెరపై కనిపించబోతుండటంతో సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.ఈ క్యూట్ కాంబో రిపీట్ అవుతున్న కొత్త చిత్రం బ్యాండ్ మేళం. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఆధ్వర్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 13న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా హీరోయిన్ శ్రీదేవి అపల్లా మాట్లాడుతూ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని చెప్పింది. ‘కోర్ట్’ తర్వాత తాను విన్న మొదటి కథ ‘బ్యాండ్ మేళం’ అని పేర్కొంది. నేను ఎక్కడికెళ్లినా ఇప్పటికీ తనను “జాబిలి” అని పిలుస్తున్నారని, అది తనకు చాలా సంతోషాన్ని ఇస్తుందని చెప్పింది. ‘బ్యాండ్ మేళం’లో రాజమ్మ పాత్ర ట్రాన్స్ఫర్మేషన్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని, మొదట నవ్విస్తే చివర్లో భావోద్వేగానికి గురిచేస్తుందని ఆమె వెల్లడించింది. దర్శకుడు సతీష్ జవ్వాజి కథను రెండున్నర గంటలపాటు నిలబడేలా నేరేట్ చేశారని ప్రశంసించింది.

‘కోర్ట్’ చిత్రానికి సంగీతం అందించిన విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకూ మ్యూజిక్ ఇవ్వడం విశేషం. కోన వెంకట్ ప్రొడక్షన్‌లో పని చేయడం ఆనందంగా ఉందని శ్రీదేవి పేర్కొంది. హర్ష్ రోషన్‌తో మళ్లీ పని చేయడం సంతోషంగా అనిపించిందని, ఈ సినిమా తర్వాత ఆయనను మిస్ అవుతానేమోనని సరదాగా చెప్పింది. గత ఏడాది మార్చి 14న ‘కోర్ట్’ రిలీజ్ కాగా, ఈ ఏడాది మార్చి 13న ‘బ్యాండ్ మేళం’ విడుదల కావడం విశేషం. ‘కోర్ట్’ కంటే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని శ్రీదేవి చెప్పింది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య–శ్రావ్య నిర్మిస్తున్న ఈ చిత్రం యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. నవ్వులు, ఎమోషన్స్ మేళవించిన ఈ ‘బ్యాండ్ మేళం’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Latest News