Janhvi Kapoor | టీనేజ్‌లోనే బయపెట్టించిన డీప్ ఫేక్ .. జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు
Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న జాన్వీ, ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా తన టీనేజ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
Janhvi Kapoor | బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన షాకింగ్ విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న జాన్వీ, ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సందర్భంగా తన టీనేజ్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.
“15 ఏళ్ల వయసులోనే షాక్ ఇచ్చిన ఘటన”
జాన్వీ మాట్లాడుతూ “దీనిని డీప్‌ఫేక్ అంటారో లేదో తెలియదు. కానీ నాకు 15 ఏళ్లు ఉన్నప్పుడు ఓ అశ్లీల వెబ్‌సైట్‌లో నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అప్‌లోడ్ చేశారు. నా క్లాస్‌మేట్స్ ఆ ఫోటోలు చూశామని చెప్పినప్పుడు, ఆ క్షణంలో నేను ఏం చేయాలో అర్థం కాలేదు” అని తెలిపారు.
ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో ఒత్తిడికి గురయ్యానని వెల్లడించారు. ఆ సమయంలో చాలా భయపడ్డా… ఎంతో కలత చెందా అని భావోద్వేగంగా చెప్పారు.
సోషల్ మీడియా నైతికతపై ఆవేదన
ఆ సంఘటనతో సోషల్ మీడియా లోని ప్రమాదాలను అర్థం చేసుకున్నానని జాన్వీ చెప్పారు.
“సోషల్ మీడియాలో కనీస నైతికత కూడా ఉండదని అప్పుడే తెలుసుకున్నాను. ఎవరో చేసిన తప్పుకు మనమే బాధపడాల్సి వస్తుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
జాన్వీ ప్రకారం, ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతూనే ఉందట.డీప్‌ఫేక్ కారణంగా ఇప్పటికీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాను. కొన్ని సందర్భాల్లో ప్రశాంతత లేకుండా పోతుంది అని తెలిపారు. ఇంకా కొన్ని మీడియా సంస్థలు కూడా తన AI మార్ఫింగ్ ఫోటోలను నిజమైనవిగా భావించి ప్రచారం చేయడం తన వర్క్ లైఫ్‌పై ప్రభావం చూపుతోందని అన్నారు.
మాట్లాడాలనిపించినా… ఆగిపోతుంటా
ఈ సమస్యపై గట్టిగా స్పందించాలని అనిపించినా, కొన్నిసార్లు తనకు అంత వాయిస్ లేదనే భావనతో ఆగిపోతానని జాన్వీ వెల్లడించారు. కొన్ని విషయాలపై బహిరంగంగా మాట్లాడాలని ఉంటుంది. కానీ చివరికి మౌనం వహించాల్సి వస్తుంది” అని చెప్పారు.
సినిమాల పరంగా బిజీగా జాన్వీ
ఇక సినిమాల విషయానికి వస్తే, జాన్వీ ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె అచ్చియ్యమ్మ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram