TVK Vijay | హీరోలు (Heros), అభిమానుల (Fans) మధ్య ఉండే అనుబంధం చాలా ప్రత్యేకమైనది. తమ అభిమాన నటుడి సినిమా రిలీజైతే థియేటర్ వద్ద సందడి చేస్తుంటారు ఫ్యాన్స్. ఆ నటుడిని దగ్గరగా ఒక్కసారైనా చూడాలని, షేక్‌హ్యాండ్ ఇవ్వాలని, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఆశపడుతుంటారు. అయితే, ఆ అదృష్టం అందరికీ దక్కదు.
హీరో కనిపించినా దగ్గరకు వెళ్లాలంటే చాలా కష్టం. బౌన్సర్లు, సెక్యూరిటీని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. భద్రత దృష్ట్యా సెక్యూరిటీ సిబ్బంది హీరో దగ్గరకు ఎవ్వరినీ అనుమతించరు. దీంతో ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతుంటుంది. అయితే, తాజాగా ఓ యువతి తన అభిమాన నటుడిని దగ్గరనుంచి చూసి మురిసిపోయింది. రోడ్డుపై కేరింతలు కొడుతూ సంతోషంతో ఉప్పొంగిపోయింది.
తమిళస్టార్ దళపతి విజయ్ (Thalapathy Vijay)కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఓ యువతి విజయ్‌ని చూసి ఎగిరి గంతేసింది. ఎన్నికల నేపథ్యంలో విజయ్ తమిళనాడు వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ కారులో వెళ్తుండగా.. ఓ యువతి రోడ్డు పక్కన నిల్చొని హీరోకి అభివాదం చేస్తూ కనిపించింది. యువతిని గమనించిన విజయ్ కారులోంచే ఆ యువతికి అభివాదం చేశాడు.
అంతే హీరోని చూసిన ఆనందంలో ఆ యువతి కేరింతలు కొట్టింది. రోడ్డుపై గంతులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు విజయ్‌కి మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్యాన్ గర్ల్ మూమెంట్ (Fan Girl Moment) అంటూ కామెంట్లు పెడుతున్నారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజిల్‌కి ఓటు వేయాలంటూ పిలుపునిస్తున్నారు.
Absolute Thalapathy fangirl moment👌 #VoteForWhistle #TVKforTN #TVKVijay @TVKVijayHQ #JanaNayagan pic.twitter.com/GjdWlFaKwA
— Devanayagam (@Devanayagam) February 14, 2026
ఇవి కూడా చదవండి :
Municipal Elections | మున్సి‘పోల్స్’.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రమాద హెచ్చరిక?
AP Budget 2026 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ఇది మెరుగైన బడ్జెట్ : ఏపీ సీఎం చంద్రబాబు
