Dowry | రూ.31 ల‌క్ష‌ల క‌ట్నం తిర‌స్క‌రించిన వ‌రుడి కుటుంబం.. స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు

రాజ‌స్థాన్ (Rajasthan) అల్వార్‌ (Alwar)కు చెందిన ఓ వ‌రుడు (Groom) రూ.31 ల‌క్ష‌ల క‌ట్నం (Dowry) తిర‌స్క‌రించి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Dowry | అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్న భార‌త్‌లో ఇంకా అనేక దురాచారాలు కొనసాగుతున్నాయి. బాల్య వివాహాలు, వ‌ర‌క‌ట్న (Dowry) వేధింపులు కొన‌సాగుతున్నాయి. విద్యావంతులు, ఉన్న‌త స్థాయిలో ఉన్న వాళ్లు సైతం వ‌ర‌క‌ట్న వేధింపుల‌కు గుర‌వుతున్నారు. అయితే, నిత్యం వరకట్న వేధింపుల ఉదంతాలు వెలుగుచూస్తున్న ఇలాంటి త‌రుణంలో రాజ‌స్థాన్‌ (Rajasthan)కు చెందిన ఓ కుటుంబం అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తోంది. వ‌ధువు కుటుంబం ఇస్తున్ను భారీ క‌ట్నాన్ని సున్నితంగా తిర‌స్క‌రించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందుతోంది.

అల్వార్ (Alwar) ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం త‌మ కుమారుడికి తాజాగా వివాహం చేసింది. ఈ సంద‌ర్భంగా వ‌ధువు కుటుంబం పెళ్లి మండ‌పంపైనే వ‌రుడికి అనేక కానుకలు ఇచ్చింది. స్వీట్స్‌, ఫ్రూట్స్‌, డ్రెస్సెస్ వంటివి సంప్ర‌దాయం ప్ర‌కారం అందించింది. చివ‌రిలో ఓ ప్లేట్ నిండ రూ.31ల‌క్ష‌ల విలువైన‌ నోట్ల క‌ట్ట‌లు పెట్టి ఇవ్వ‌బోయింది. అది చూసిన వ‌రుడి తండ్రి దాన్ని సున్నితంగా తిర‌స్క‌రించారు. మాకు ఎలాంటి క‌ట్నం వ‌ద్ద‌ని చెప్పారు. మీ కుమార్తెను మా ఇంటికి కోడ‌లుగా పంప‌డ‌మే మీరు ఇచ్చే గొప్ప బ‌హుమ‌తి అని పేర్కొన్నారు. వ‌ధువు కుటుంబం నుంచి రూపాయి తీసుకుని వివాహం జ‌రిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఇది చూసిన నెటిజ‌న్లు వ‌రుడి కుటుంబంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. క‌ట్నం కోసం వేధిస్తున్న ఈరోజుల్లో ఇలాంటి మ‌నుషులు కూడా ఉన్నారా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ అమ్మాయి ఓ మంచి ఇంటికి కోడ‌లైంది అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వ‌రుడి కుటుంబం చేసిన ప‌నికి స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Airport Cafe | ఇక నుండి ఎయిర్ పోర్టుల్లో టీ రూ.10, సమోసా రూ.20 అంతే!
Dry Cleaning Shop | ఇస్త్రీ చేస్తూ నెల‌కు రూ.2.8ల‌క్ష‌ల సంపాదన‌.. ఐటీ ఉద్యోగుల‌కు కూడా ఇంత జీతం రాదేమో..!

Latest News