సౌదీలో బస్సు ప్రమాదం.. న్యూఢిల్లీ తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌

తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

విధాత: సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న తెలంగాణ యాత్రికులు కొందరు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషాదకరమైన బస్సు ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు.. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.

తెలంగాణ భవన్‌లోని సీనియర్ అధికారులు సౌదీ అరేబియా రియాద్‌లోని భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి, తెలంగాణ నుంచి ఎంత మంది వ్యక్తులు ఉన్నారో నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కాంటాక్ట్ నంబర్లు: వందన, పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్, లైజన్ హెడ్- +91 98719 99044, సీహెచ్. చక్రవర్తి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- +91 99583 22143., రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్- +91 96437 23157.