విధాత: 2022లో ఓటీటీలో సైత్ ఇండియా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ సుజల్ (Suzhal). ఐశ్వర్య రాజేశ్, కదిర్, లాల్, శరవణన్, మంజీమా మోహన్, గౌరీ జి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. బ్రహ్మ, సర్జున్ దర్శకత్వం వహించగా, పుష్కర్ గాయత్రి నిర్మించారు.
తాజాగా ఈ సుజల్ సిరీస్ (Suzhal, The Vortex Season 2) రెండో సీజన్ విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ సీజన్2 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 28 నుంచి ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవనుంది.