Site icon vidhaatha

TTD । టోకెన్ లేని వెంకన్న భక్తులకు టీటీడీ శుభ వార్త

TTD । టోకెన్(Token) లేని తిరుపతి వెంకన్న(Tirupati Venkanna) భక్తులకు టీటీడీ శుభవార్త(TTD) తెలిపింది. తిరుమలలో దళారుల(brokers) బెడదను అంతం చేసి, పారదర్శకంగా భక్తులకు(devotees) సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. గురువారం తిరుమలలోని అన్నమయ్య భవనం వెలుపల మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ దర్శనం టోకెన్లు లేని తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులకు ఆధార్ కార్డు(Aadhaar card)తో లడ్డూ ప్రసాదాలు విక్రయించాలని టీటీడీ నిర్ణయించినట్లు తెలిపారు.

సామాన్య భక్తుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం నుండి దర్శనం టోకెన్లు లేని భక్తులు లడ్డూ కౌంటర్ల(laddu counters)లో తమ ఆధార్ కార్డును నమోదు చేసుకొని రెండు లడ్డూలు పొందవచ్చని చెప్పారు. ఆధార్ కార్డు ద్వారా ప్రసాదాలు అందించేందుకు లడ్డూ కాంప్లెక్స్ లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. 48 నుండి 62 నెంబర్ల కౌంటర్లలో భక్తులు ఈ లడ్డూలు పొందవచ్చన్నారు. అయితే దర్శనం టోకెన్లు లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు ఒక ఉచిత లడ్డూతో పాటు గతంలోవలే అదనపు లడ్డూలు కొనుక్కోవచ్చునని స్పష్టం చేశారు. అలాగే టోకెన్స్ లేదా టిక్కెట్లు కలిగిన భక్తులు లడ్డూల లభ్యతను బట్టి ఒక ఉచిత లడ్డూ తో పాటు 4 నుంచి 6లడ్డూలను కొనుక్కోవచ్చని చెప్పారు. గతంలో కొందరు దళారులు లడ్డూలు కొనుగోలు చేసి, భక్తులకు అధిక ధరల విక్రయించినట్లు టీటీడీ గుర్తించిందన్నారు. దీనిని అరికట్టేందుకు గురువారం నుండి రోజువారీ టోకెన్ లేని ప్రతి భక్తునికి ఆధార్ పై రెండు లడ్డూలు మాత్రమే ఇవ్వాలని టీటీడీ నిర్ణయించిందని చెప్పారు. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించి టీటీడీకి సహకరించాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు.

Exit mobile version