Winchester Mystery House | తమ రాజసాన్ని చూపించుకోవడం కోసం చరిత్రలో చాలామంది భారీ కట్టడాలను నిర్మించారు. కొందరు వారికి ఇష్టమైన నిర్మాణాలను కట్టిస్తే మరికొందరు వారి విజయాలకు గుర్తులుగా.. తమ ప్రేమకు ప్రతిరూపాలుగా కొన్ని ప్రత్యేకమైన కట్టడాలను కట్టించారు. కానీ, అమెరికాలో ఉన్న ఓ మిస్టరీ భవనాన్ని మాత్రం ఆత్మల కోసం కట్టించారనే ప్రచారం వందల ఏండ్లుగా కొనసాగుతోంది. ఆ భవనమే సాన్‌జోస్ నగరంలో ఉన్న విన్చెస్టర్ మిస్టరీ హౌస్. ఇది భవనం మాత్రమే కాదు.. ఒక రహస్యమైన నిర్మాణం. ఎందుంటే 24,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవంతిలో ప్రతిదీ వింతగా ఉంటుంది. అందులో దారిలేని మెట్లు, గాలిలోకి తెరుచుకునే తలుపులు, నేలపై అమర్చిన స్కైలైట్లు వీటితో ఈ బిల్డింగ్ కు ‘మిస్టరీ హౌస్’ అనే పేరు వచ్చింది.
అసలెంటీ ఈ భవంతి చరిత్ర..
ప్రసిద్ధ విన్చెస్టర్ రైఫిల్ కంపెనీ యజమాని అయిన విలియమ్ విన్చెస్టర్ భార్య అయిన సారా విన్చెస్టర్ ఈ మిస్టరీ హౌస్ ను నిర్మించింది. దీనికి కారణం విన్చెస్టర్ తుపాకీల వల్ల చనిపోయిన ఆత్మలు తనను వెంటాడుతున్నాయని, ఈ భయంతో ఎప్పటికీ పూర్తి కానీ భవనాన్ని కడితే ఆత్మలు తనను పీడించలేవని ఓ ఆధ్యాత్మిక గురువు తనకు చెప్పారంటా. దీంతో సారా 1884లో ప్రారంభించిన ఈ భవన నిర్మాణం 38 ఏళ్ల పాటు ఆగలేదు. రాత్రింబవళ్లూ కడుతున్నా ఈ భవంతి కట్టడం పూర్తి కాలేదు. చివరకు సారా మరణించడంతో ఈ నిర్మాణం ఆగిపోయింది. కాగా, ఈ ఇంట్లో 160 గదులు 160 గదులు, 2,000 తలుపులు, 47 మెట్లు, 10,000 కిటికీలు, 52 స్కైలైట్లు ఉన్నాయి. ఇందులో గోడలకు తలుపులు, ఎక్కడికివెళ్లాలో తెలియని మెట్లు నిర్మించారు. కాగా, 1906లో సాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన భూకంపంలో ఈ భవనం దెబ్బతిన్నది. దీంతో సారా అప్పటి నుంచి ఈ బిల్డింగ్ ను మూసివేసింది.
మిస్టరీ హౌస్‌లో ఆత్మల సంచారం?
ఇప్పటికీ ఆ గది చుట్టూ వింత శబ్దాలు వినిపిస్తాయని పర్యాటకులు చెబుతుంటారు. కొన్నిసార్లు తలుపులు వాటంతట అవే తెరుచుకోవడం, వింత శబ్ధాలు వినిపించడం, నీడ ఆకారంలో రూపాలు కనిపించాయని టూరిస్టులు చెబుతున్నారు. అయితే, సారానే ఆత్మగా మారి భవనంలో తిరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ భవనాన్ని కొందరు ఆర్కిటెక్చర్ అద్భుతంగా కొనియాడితే.. ఆత్మల భయం వల్లే సారా విన్చెస్టర్ కట్టడాన్ని నిర్మించారని మరికొందరు నమ్ముతున్నారు. ఏది ఏమైనా ఈ మిస్టీరీ హౌస్ (Winchester Mystery House) మాత్రం పర్యాటకులను రోజురోజుకు ఆకర్షిస్తోంది.
