- పోలీసులకు గూడూరు ఫిర్యాదు
విధాత : రజాకార్ సినిమా నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డికి వరుస బెదిరింపుల కాల్స్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గూడూరు నారాయణ రెడ్డికి దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు అయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అప్రమత్తమైన ప్రభుత్వం ఆయనకు 1+1సీఆర్పీఎఫ్ జవాన్లను భద్రత నిమిత్తం కేటాయించింది.
పార్లమెంటు ఎన్నికల ముందు విడుదలైన రజాకార్ సినిమా హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటాలు..నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అకృత్యాలపై నిర్మించగా, సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. రజాకార్ చిత్ర నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి వివాదాల మధ్య సాగింది. చివరకు విడుదల అనంతరం కూడా సినిమా చుట్టు వివాదాలు..చర్చలు కొనసాగుతుండటం విశేషం.