Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ( Congress Party ) మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ( Rahul Gandhi )కి సూరత్ కోర్టు( Surat Court ) రెండేండ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రాహుల్‌ను దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు తీర్పు వెల్లడించింది.
2019లో కర్ణాటక( Karnataka )లో జరిగిన ఓ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మోదీ( Modi ) ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలే అని పేర్కొన్నారు. దీంతో గుజరాత్( Gujarat )కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు రాహుల్‌పై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో సూరత్ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా రాహుల్ గాంధీకి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ కేసులో రాహుల్‌కు వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు.