Site icon vidhaatha

బంగ్లాదేశ్‌: పడవ మునిగి.. 23 మంది మృతి

విధాత‌: బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జ‌రిగింది. ఉత్తర పంచగఢ్ జిల్లాలో కరాటోవా నదిలో పడవ మునిగి 23 మంది మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు గ‌ల్లంత‌య్యారు. ఘ‌ట‌నాస్థ‌లంలో అధికారులు స‌హాయ చ‌ర్య‌లు ముమ్మ‌రం చేప‌ట్టి మృతదేహాలను వెలికితీశారు.

మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 70 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎంత‌మంది గ‌ల్లంత‌య్యార‌న్న‌ది కచ్చితంగా చెప్పలేమన్నారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Exit mobile version