Site icon vidhaatha

America | ఏడాది పాప‌ను.. తుపాకీతో కాల్చిన మూడేండ్ల బాలుడు

America | ఓ మూడేండ్ల బాలుడు త‌న తోబుట్టువైన ఏడాది పాప‌ను హ్యాండ్ గ‌న్‌తో కాల్చాడు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమ‌వారం వెలుగు చూసింది.

కాలిఫోర్నియాలోని శాండియాగో కౌంటీలో త‌న ఇంట్లో హ్యాండ్‌గ‌న్‌ను మూడేండ్ల బాలుడు త‌న చేతిలోకి తీసుకున్నాడు. అనుకోకుండా ఆ గ‌న్‌తో త‌న సోద‌రి(1)ని కాల్చాడు. దీంతో ఆ పాప త‌ల‌కు తీవ్ర గాయ‌మైంది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని పాప‌ను ప‌లోమ‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిన్నారి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూసింది.

బాలుడు కాల్పుల‌కు పాల్ప‌డిన హ్యాండ్‌గ‌న్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి త‌ల్లిదండ్రులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

Exit mobile version