America | ఓ మూడేండ్ల బాలుడు తన తోబుట్టువైన ఏడాది పాపను హ్యాండ్ గన్తో కాల్చాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం వెలుగు చూసింది. కాలిఫోర్నియాలోని శాండియాగో కౌంటీలో తన ఇంట్లో హ్యాండ్గన్ను మూడేండ్ల బాలుడు తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోకుండా ఆ గన్తో తన సోదరి(1)ని కాల్చాడు. దీంతో ఆ పాప తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పాపను పలోమర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ […]
America | ఓ మూడేండ్ల బాలుడు తన తోబుట్టువైన ఏడాది పాపను హ్యాండ్ గన్తో కాల్చాడు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో సోమవారం వెలుగు చూసింది.
కాలిఫోర్నియాలోని శాండియాగో కౌంటీలో తన ఇంట్లో హ్యాండ్గన్ను మూడేండ్ల బాలుడు తన చేతిలోకి తీసుకున్నాడు. అనుకోకుండా ఆ గన్తో తన సోదరి(1)ని కాల్చాడు. దీంతో ఆ పాప తలకు తీవ్ర గాయమైంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పాపను పలోమర్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
బాలుడు కాల్పులకు పాల్పడిన హ్యాండ్గన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.