Accident In America| అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

Accident In America| అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం

హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన కుటుంబం సజీవ దహనమైంది. మృతులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బెజిగం శ్రీ వెంకట్(40), తేజస్విని(36), సిద్ధార్థ్(9), మృదా(7)లుగా గుర్తించారు. వెంకట్ దంపతులు తమ పిల్లలతో కలిసి వెకేషన్ కోసం డల్లాస్ వెళ్లారు. ఈ క్రమంలో అట్లాంట వెళ్లి.. తిరిగి డల్లాస్ కు వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వెంకట్ దంపతులతో పాటు పిల్లలు మృతి చెందారు.

వెంకట్ కుటుంబం దుర్మరణం సమాచారం భారత్ లోని హైదరాబాదు తిరుమలగిరికి చెందిన వారి కుటుంబ సభ్యులు, బంధువులలో తీవ్ర విషాదం నింపింది. మూడున్నర ఏళ్ల కిందట శ్రీ వెంకట్ ఉద్యోగం రీత్యా అమెరికాలోని డలాస్ వెళ్లారు. ఆ తర్వాత భార్య పిల్లల్ని, తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లారు. శ్రీ వెంకట్ సోదరి దీపిక, ఆయన మామ నాగరాజు అట్లాంటాలో ఉంటున్నారు. ఇటీవల సెలవులు రావడంతో వారి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.