Python: భారీ కొండ చిలువను పట్టుకుని.. మూడు కిలోమీటర్లు (వీడియో వైరల్)

Python | Viral | Video
విధాత: అసలే అది 15 అడుగుల భారీ కొండచిలువ.. దగ్గరికెళితే పశువులనే కాదు..మనుషులను కూడా మింగేసే రకం. అలాంటి భారీ కొండ చిలువను చూస్తే ఎవరైనా దూరంగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని బులంద్షహర్ లో ఆ భారీ కొండచిలువను గ్రామానికి చెందిన బాలురు, యువకులు బంధించారు. అంతేకాదు..దానిని చేతుల్లో పట్టుకుని ఏదో ఊరేగింపు అన్నట్లుగా రోడ్డు వెంట మూడు కిలోమీటర్లపైగా నడిచి వెళ్లి దూరాన ఉన్న అడవిలో వదిలేశారు.
పిల్లలు కొండ చిలువను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెలుతుంటే ఆ దారి వెంట ప్రయాణికులు ఆశ్చర్యకరంగా ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గ్రామానికి చెందిన మేకలు, పశువులు, కోళ్లను కబళిస్తుండటంతో కొండచిలువను బంధించి చంపకుండా సురక్షితంగా మూడు కిలోమీటర్లు నడిచి మరీ అడవిలో వదిలిపెట్టిన బాలుర సాహసాన్ని.. మంచిపనిని వన్యప్రాణి ప్రేమికులు..నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.