Site icon vidhaatha

Rangareddy | స్వైపింగ్‌ లేదన్నందుకు.. పెట్రోల్‌ బంక్‌లో యువకుల అరాచకం

విధాత: Rangareddy రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ (Narsingh)లో మద్యం మత్తులో ముగ్గురు యువకులు అరాచకం సృష్టించారు. రాత్రి పెట్రోల్‌ బంక్ (Petrol Bunk) సిబ్బందిపై దాడి చేశారు. యువకుల దాడిలో పెట్రోల్‌ బంక్‌కు చెందిన కార్మికుడు మృతి చెందగా, మరొక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌ శివారులోని నార్సింగ్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

జన్వాడకు చెందిన నరేందర్‌ (Narendr), మల్లేశ్‌(Mallesh), అభిషేక్‌ (Abhishek) అనే యువకులు రాత్ర మద్యం తాగి కారులో వెళ్తున్నారు. కారులో పెట్రోల్‌ పోయించుకోవడానికి బంక్‌కు వెళ్లిన ముగ్గురు డబ్బులు చెల్లించే క్రమంలో కార్డు ఇచ్చారు. స్వైపింగ్‌ మిషన్‌ లేదని డబ్బులే ఇవ్వాలని అక్కడ పనిచేస్తున్న కార్మికుడు సంజయ్‌ అడిగాడు.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువకులు బంకులో పనిచేస్తున్న సిబ్బందిపై దాడి చేశారు. యువకులు సంజయ్‌ తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా చోటు అనే మరో కార్మికుడు తీవ్ర గాయాల పాలయ్యాడు.

సంజయ్‌ మృతి కారణమైన ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని జన్వాడ గేటు ప్రధాన రహదారిపై బాధిత కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నరేందర్‌, మల్లేశ్‌, అభిషేక్‌లపై ఇప్పటికే లైంగికదాడి, దొంగతనం కేసులు ఉన్నాయని, ఈ ముగ్గురు కలిసి గతంలో జర్నలిస్టులపై దాడి చేసినట్లు ఆరోపించారు.

ఇలాంటి వారిని వదిలేస్తే మరిన్ని ఘటనలు పునరావృతమవుతాయని, వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version