Site icon vidhaatha

గుండెపోటుతో మూడో తరగతి విద్యార్థి మృతి

విధాత: సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వెంకట్రావు పల్లికి చెందిన బుర్ర కుషిత సతీష్ దంపతులకు కొడుకు కౌశిక్ (9), కుమార్తె మేఘన ఉన్నారు. కాగా.. కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.

పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలిచి ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయులు వాహనంలో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత (హార్ట్ వీక్) వ్యాధితో చిన్నారి బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు.

Exit mobile version