Lightning Strikes |
విధాత: పిడుగులు అంటేనే ప్రజలు వణికిపోతారు. ఆ మెరుపులను చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తోంది. మరి అంతటి భయంకరమైన పిడుగులు (Lightning Strikes) పదుల సంఖ్యలో కాదు వేల సంఖ్యలోనే పడ్డాయి.
ఒడిశా(Odisha)లోని భద్రక్ జిల్లా (Bhadrak Dist) బాసుదేవపూర్‌లో బుధవారం సాయంత్రం 30 నిమిషాల వ్యవధిలోనే 5,450 పిడుగులు పడ్డాయి. ఈ పిడుగుల శబ్ధానికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కొందరైతే వణికిపోయారు. ఈ పిడుగుల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
ఈ సందర్భంగా గోపాల్‌పూర్ డాప్లార్ రాడార్ కేంద్రం అధికారి ఉమాశంకర్ దాస్ మాట్లాడుతూ.. ఆకాశంలో కుమ్యులోనింబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని తెలిపారు.
ఇలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. ప్రతి పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాడార్ కేంద్రానికి ఉందని ఉమాశంకర్ దాస్ తెలిపారు.