Site icon vidhaatha

BJP టికెట్లకు.. 6003 దరఖాస్తులు

BJP

విధాత: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ పార్టీ టికెట్ల కోసం ఆశావహుల నుంచి చేపట్టిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆరు రోజుల పాటు కొనసాగి ఆదివారంతో ముగిసింది. చివరి రోజు ఏకంగా 2700మంది దరఖాస్తులు సమర్పించగా, మొత్తం 6003దరఖాస్తులు అందాయి.

దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి రుసుము వసూలు చేయకపోవడంతో అధిక దరఖాస్తులకు కారణమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 119నియోజక వర్గాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.

పార్టీ సీనియర్ నాయకులు జితేందర్‌రెడ్డి, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ లు మినహా ముఖ్య నేతలు దరఖాస్తులు సమర్పించక పోవడం ఆసక్తికరం. ఈటల సైతం తన అనుచరుల ద్వారా గజ్వేల్ టికెట్ కోసం తన దరఖాస్తు సమర్పించారు.

Exit mobile version