- తొలి జాతీయ సమీక్ష సర్వే వెల్లడి
- కెమెరాకు చిక్కిన 241 చిరుతలు
Leopard | విధాత: దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలు ఉన్నాయి. దేశంలో తొలిసారి నిర్వహించిన ఐదేండ్ల మముత్ సర్వేలో ఈ లెక్కతేలింది. 120,000 చదరపు కిలోమీటర్లు (46,000 చదరపు మైళ్ళు) వాటి రిమోట్ పర్వత నివాసాలను పర్యవేక్షించగా, 718 మంచు చిరుతలు ఉన్నట్టు వెల్లడైంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ బుధవారం మీడియాకు వెల్లడించింది.
అంతుచిక్కకుండా ప్రవర్తించే మంచు చిరుతలను “పర్వతాల దెయ్యాలు” అని పిలుస్తారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే 200 కంటే ఎక్కువ మంచుచిరుతల ఫొటోలను పరిశోధకులు తీశారు. దాదాపు 2,000 ప్రాంతాల్లో అమర్చిన నిఘా కెమెరాల్లో 241 చిరుతలు కనిపించాయి. 1,80,000 కంటే ఎక్కువ రాత్రులను పరిశోధకులు రికార్డు చేశారు. ఇందుకు కెమెరా ట్రాప్‌లను వినియోగించారు.
సాధారణ చిరుతలతో పోలిస్తే మంచు చిరుతలు కాస్త భిన్నంగా ఉంటాయి. ముదురు మచ్చలతో నిండిన మందపాటి బూడిద రంగు బొచ్చు, సహజ మంచు బూట్లు వలె పనిచేసే పెద్ద పాదాలు వీటికి ఉంటాయి. రహస్యంగా ఉంటూ జీవాలను మభ్యపెట్టడంలో మంచుచిరుతలు మాస్టర్స్ అని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా తెలిపింది.
మంచు చిరుతల శాస్త్రీయ నామం పంతేర హన్సికా. హాని కలిగించే జంతు జాతుల జాబితాలో వీటిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ చేర్చింది. సర్వేకు ముందు, భారతదేశంలో 400-700 మంచు చిరుతలు ఉన్నాయని వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సూచించింది. తాజా నివేదికతో మంచుచిరుతలు దాదాపు డబుల్ అయినట్టు వెల్లడైంది. మూడింట రెండు వంతుల మంచు చిరుతలు లడఖ్‌లో, మిగిలినవి ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్నాయని సర్వేలో తేలింది.
“మంచు చిరుతపులి దీర్ఘకాలిక మనుగడను నిర్ధారించడానికి స్థిరమైన పర్యవేక్షణ అవసరం” అని పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియాలోని 12 దేశాల్లో 6,390 కంటే ఎక్కువ మంచు చిరుతలు ఉండకపోవచ్చని ఓ సంస్థ వెల్లడించింది.