Indian Army | ల‌డ‌ఖ్‌లో ఘోర ప్ర‌మాదం.. 9 మంది సైనికులు దుర్మ‌ర‌ణం

Indian Army | జ‌మ్మూక‌శ్మీర్‌లోని ల‌డ‌ఖ్‌లో శ‌నివారం సాయంత్రం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. లేహ్ జిల్లాలో ఓ ఆర్మీ వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ వాహ‌నం తునాతున‌క‌లైంది. శ‌నివారం సాయంత్రం ఆర్మీ కాన్వాయ్ కారు గ్యారిస‌న్ నుంచి ఖేరికి బ‌య‌ల్దేరింది. కాన్వాయ్‌లోని మూడు వాహ‌నాల్లో 34 మంది సైనికులు వెళ్తున్నారు. ఇందులోని ఓ వాహ‌నం ఖేరి ప‌ట్ట‌ణానికి 7 కిలోమీట‌ర్ల దూరంలో అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే […]

  • Publish Date - August 19, 2023 / 11:51 PM IST

Indian Army | జ‌మ్మూక‌శ్మీర్‌లోని ల‌డ‌ఖ్‌లో శ‌నివారం సాయంత్రం ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. లేహ్ జిల్లాలో ఓ ఆర్మీ వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మీ వాహ‌నం తునాతున‌క‌లైంది.

శ‌నివారం సాయంత్రం ఆర్మీ కాన్వాయ్ కారు గ్యారిస‌న్ నుంచి ఖేరికి బ‌య‌ల్దేరింది. కాన్వాయ్‌లోని మూడు వాహ‌నాల్లో 34 మంది సైనికులు వెళ్తున్నారు. ఇందులోని ఓ వాహ‌నం ఖేరి ప‌ట్ట‌ణానికి 7 కిలోమీట‌ర్ల దూరంలో అదుపుత‌ప్పి రోడ్డు ప‌క్క‌నే ఉన్న లోయ‌లో ప‌డిపోయింది.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను వెలికితీశారు. మృతుల్లో 8 మంది సైనికుల‌తో పాటు జూనియ‌ర్ క‌మిష‌న్డ్ ఆఫీస‌ర్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో జవాన్లను కోల్పోవడం ఎంతో బాధాకరం. దేశానికి వారు చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేం. మృతుల కుటుంబ సభ్యుల చుట్టే మా ఆలోచనలు సాగుతున్నాయ‌ని పేర్కొన్నారు.

Latest News