Love Marriage |
ప్రేమకు, ప్రేమించుకోవడానికి వయసు అడ్డురాదు. ఏ వయసులోనైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమించుకోవచ్చు. ఓ 22 ఏండ్ల యువకుడు.. 48 ఏండ్ల టీచర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. మరి వీరి ప్రేమ కథ గురించి తెలుసుకోవాలంటే మలేషియా వెళ్లాల్సిందే.
మలేషియాకు చెందిన మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ(22) 2016లో తాను చదువుకున్న పాఠశాలకు వెళ్లాడు. నాలుగో తరగతిలో తనకు చదువు చెప్పిన టీచర్ జమీలాను అదే స్కూల్లో కలిశాడు. తనను గుర్తు చేస్తూ ఆమెను పలుకరించాడు. ఇక ఒకరికొకరు ఫోన్ నంబర్స్ మార్చుకున్నారు.
అయితే ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అహ్మద్ అలీ పుట్టిన రోజున జమీలా ఫోన్‌లో శుభాకాంక్షలు తెలుపుతూ మేసేజ్ చేసింది. టీచర్‌పై అలీ ఇష్టం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నట్లు టీచర్‌కు ఫోన్‌లో చెప్పాడు. కానీ ఆమె అతన్ని ప్రేమను తిరస్కరించింది.
ఇద్దరి మధ్య 26 ఏండ్ల వయసు తేడా ఉందని రిజెక్టు చేసింది. అవేమీ పట్టించుకోని అలీ.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లాడు. ఇక తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు. చివరకు జమీలా అలీ ప్రేమను అంగీకరించింది.
వారి ప్రేమకు గుర్తుగా 2019లోనే వాళ్లిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించారు. కొవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. 2021లో దగ్గరి బంధువుల సమక్షంలో అలీ, జమీలా ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లి ప్రస్తుతం వైరల్ అవుతోంది. జమీలా 2007లో తన భర్తతో విడాకులు తీసుకుంది.