Site icon vidhaatha

Nizamabad PS: కాళ్లకు సంకెళ్లు వేసి వెట్టి చాకిరీ

Nizamabad PS: నేరారోపణలతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటే వారిని పోలీస్ స్టేషన్ లోని సెల్ ఉంచుకుని 24గంటల్లోగా కోర్టులో హాజరుపరుచాల్సి ఉంటుంది. కోర్డులో హాజరుపరిచాకా వారిని రిమాండ్ చేయడం..బెయిల్ పై విడుదల చేయడం చట్ట ప్రక్రియ. కేసు విచారణ క్రమంలో పోలీసులు నేరాన్ని రుజువు చేస్తే నిందితుడుకి కోర్టు శిక్ష విధించడం జరుగుతుంది. ఇదంతా న్యాయవ్యవస్థలో ని ప్రక్రియ.

కాని నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడి కాళ్లకు సంకేళ్లు వేసి పోలీసులు వెట్టి చాకిరి చేయిస్తున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ కేసులో అరెస్టు చేసిన ఆ యువకుడి కాళ్లకి సంకెళ్లు (shackles) వేసి స్టేషన్ లో చీపురుతో క్లిన్ చేయించుకున్న ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ ఈ దాష్టీకానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ వ్యవహారం ఫ్రెండ్లీ పోలీస్ నినాదానికే మచ్చగా తయారైంది. క్షేత్ర స్థాయిలో పోలీసుల పనితీరును ప్రశ్నార్ధకం చేస్తుంది. చిన్నచిన్న కేసుల్లో అరెస్టు అయిన వారిని రోజుల తరబడి పోలీస్ స్టేషన్లోనే ఉంచుకుని వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపణలు ఈ సందర్భంగా మరోసారి తెరపైకి వస్తున్నాయి. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్ పోలీస్ స్టేషన్ లో అరెస్టయిన వ్యక్తిని ఏ నేరంపై పోలీస్ స్టేషన్ లో ఉంచారు..ఎన్ని రోజులుగా అలా సంకెళ్లతో నిర్భంధించారన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version