భోపాల్ : మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఘోరం జరిగింది. ఆ రాష్ట్ర సచివాలయంలో శనివారం ఉదయం మంటలు ఎగిసిపడ్డాయి. సచివాలయం పైఅంతస్తులో మంటలు చెలరేగడంతో పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది.
#WATCH | Madhya Pradesh | A massive fire breaks out at Vallabh Bhavan State Secretariat in Bhopal. Firefighting operations are underway. Details awaited. pic.twitter.com/QBto0QSVIy
— ANI (@ANI) March 9, 2024
ఈ అగ్నిప్రమాదం శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు సెక్రటేరియట్ అధికారులు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పొగలు దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.