దుంకా గ్యాంగ్ రేప్ కేస్.. ముగ్గురు అరెస్ట్

జార్ఖండ్ లోని దుంకా జిల్లా, హన్స్ దిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుంకా ఎస్పీ తెలిపారు

  • Publish Date - March 2, 2024 / 11:49 AM IST

  • జార్ఖండ్‌లో స్పానిష్ మ‌హిళ‌పై సామూహిక అత్యాచారం
  • పోలీసుల‌ అదుపులో ముగ్గురు
  • మిగ‌తా వారి కోసం గాలింపు ముమ్మ‌రం
  • వైద్య ప‌రీక్ష‌ల కోసం ఆసుప‌త్రికి బాధిత మ‌హిళ‌


రాంచీ: జార్ఖండ్ లోని దుంకా జిల్లా, హన్స్ దిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి స్పానిష్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ విషయమై బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు దుంకా ఎస్పీ తెలిపారు. ముగ్గురు అనుమానితుల‌ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుప‌త్రికి పంపించామ‌ని ఎస్పీ తెలిపారు. కేసును దర్యాప్తు చేస్తున్నామ‌న్నారు.


బాధిత‌ మహిళ తన భర్తతో కలిసి భారత పర్యటనకు వచ్చినట్లు సమాచారం. యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం రాత్రి జరిగిందని జర్ముండీ సబ్ డివిజనల్ పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాత్రి దంపతులిద్దరూ బైక్ పై బంగ్లాదేశ్ నుంచి దుమ్కాకు చేరుకున్నారు. వారు బీహార్ మీదుగా నేపాల్ వెళ్తున్నారని మరో అధికారి పేర్కొన్నారు. రాత్రి 12 గంటల సమయంలో అతను గుడారం వేసుకొని హన్స్ దిహా మార్కెట్ కు ముందు కుంజి-కురు మహత్ అనే ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆ సమయంలో 7, 8 మంది స్థానిక యువకులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.


ఇప్పటివరకు ఈ ఘటనకు పాల్పడిన వారిలో ముగ్గురిని అరెస్టు చేశామని, మిగిలిన వారికోసం తీవ్ర గాలింపు కొనసాగుతోందని పోలీస్‌ అధికారి వివ‌రించారు. వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం బాధితురాలని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ జార్ఖండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న రోజునే ఈ సామూహిక అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళలపై లైంగిక అత్యాచారాల పట్ల మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన నేరస్థులను వెంటనే అరెస్టు చేసి బాధిత‌ మహిళకు న్యాయం చేయాలని ప్రధాని అధికారుల‌ను ఆదేశించారు.

Latest News