Site icon vidhaatha

Saddula Cheruvu | సద్దుల చెరువులో పడి ఒకరి మృతి

విధాత: సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు (Saddula Cheruvu)లో పడి ఒకరు దుర్మరణం చెందారు. సూర్యాపేట మండలం యార్కరం గ్రామానికి చెందిన బుర్ర లింగయ్య (Burra Lingayah) (25) పెళ్లి కి బ్యాండు వాయించేందుకు వచ్చిన క్రమంలో బహిర్భూమికని చెరువు వద్దకు వెళ్లాడు. కాలుజారి చెరువులో పడిపోగా గంట వరకు ఆచూకీ లభించలేదు. గ్రామస్తులు చెరువులో వెతికి అతడి మృతదేహాన్ని వెలికి తీశారు.

Exit mobile version