Site icon vidhaatha

Aaradhya Bachchan | ఢిల్లీ హైకోర్టుకు అమితాబచ్చన్‌ మనుమరాలు..! కారణం ఏంటంటే..?

Aaradhya Bachchan | బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య అందరికీ తెలిసిందే. ఆరాధ్య ఆరోగ్యం, జీవితంపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందుకు యూట్యాబ్‌ టాబ్లాయిడ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ అభిషేక్‌ బచ్చన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన కూతురికి 11 సంవత్సరాలని, మైనర్‌ అయినందున వార్తలు ప్రసారం చేయకుండా నిషేధం విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై గురువారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. తన కూతురుపై ఆన్‌లైన్‌ మాధ్యమాల్లో వస్తున్న వ్యతిరేక ట్రోల్స్‌పై అభిషేక్‌ స్పందిస్తూ ద్వేషపూరిత వ్యాఖ్యలను సహించబోనని స్పష్టం చేశారు. పబ్లిక్‌ ఫిగర్‌ అయితే ఎవరైనా తనతో ఏదైనా చెప్పాల్సి వస్తే.. తన ముఖంపై నేరుగా చెప్పవచ్చని, కానీ, తన కుమార్తెను ఇందులోకి లాగొద్దన్నారు.

ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల కిందట ఎయిర్‌పోర్ట్‌లో ఆరాధ్య తన తల్లి ఐశ్వర్యరాయ్‌తో కలిసి ఉన్న వీడియో వైరల్‌ అయ్యింది. విమానాశ్రయంలో ఆరాధ్య ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లను చూడగానే తన నడక స్టయిల్‌గా మార్చగా.. వీడియ వైరల్‌ అయ్యింది. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో ఆరాధ్యపై ట్రోల్స్‌ ఎక్కువయ్యాయి. ఈ విషయంపై అభిషేక్‌ బచ్చన్‌ ట్రోల్స్‌ చేయొద్దని, తన కుటుంబానికి సంబంధించి తప్పుడు వార్తలు రాయొద్దని హెచ్చరించడంతో పాటు విజ్ఞప్తి చేసినా ట్రోల్స్‌ ఆగలేదు. యూట్యూబర్లు అడ్డగోలుగా ఆరాధ్యపై వార్తలు ప్రసారం చేస్తున్నారు. ప్రధానంగా ఓ యూట్యూబ్ చానల్ ఆరాధ్య ఆరోగ్యం గురించి, ఆమె జీవితం గురించి తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ విషయం బచ్చన్‌ ఫ్యామిలీ దృష్టికి రావడంతో ఆరాధ్య తరఫున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Exit mobile version