Site icon vidhaatha

TSPSC: పేపర్ లీకేజీ పై ABVP నిరసన.. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

విధాత: టిఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ స్కామ్‌ను నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. బోర్డు చైర్మన్, కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని స్కామ్‌ వెనుక ఉన్న బడా నాయకుల ప్రమేయాన్ని బట్టబయలు చేసేందుకు సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

అన్ని పరీక్షలు రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని, లేనిపక్షంలో ఏబీవీపీ విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తుందని హెచ్చ‌రించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు చత్రపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అభినవ్, జయేందర్, ప్రశాంత్, హరిత, జయంత్, జిల్లా కన్వీనర్ సంపత్, నాయకులు గోపి, చారి, అశోక్, సహాయం, రవి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

మరోవైపు సిపిఎం, కెవిపిఎస్ ఆధ్వర్యంలో పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద టిఎస్‌పీఎస్‌సీ చైర్మన్ దిష్టిబొమ్మను దహ‌నం చేశారు. కార్యక్రమంలో కెవిపిఎస్ ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, మెడబోయిన కిరణ్, సైదులు, సతీష్, రాజు, మంజుల, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version