Site icon vidhaatha

Kabir Singh | పెళ్లిపీటలెక్కనున్న శాకుంతలం విలన్‌ కబీర్‌ సింగ్‌..!

Kabir Singh | చేసింది తక్కువ సినిమాలే అయిన తన నటనతో ఆకట్టుకున్నారు కబీర్‌ సింగ్‌. టాలీవుడ్‌లో విలన్‌గా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. గోపీచంద్‌ ‘జిల్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కబీర్‌ సింగ్‌. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు.

తెలుగుతో పాటు కోలీవుడ్‌లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘శాకుంతలం’ చిత్రంలో అసుర రాజు పాత్రలో మెరిశారు. ఇక అసలు విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర్ల జాబితాలో ఒకరైన కబీర్‌ సింగ్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తున్నది.

హర్యానాకు చెందిన యువతిని పెళ్లాడనున్నట్లు టాక్‌ నడుస్తున్నది. హర్యానాలోని సూరజ్ ఖండ ఫంక్షన్ హాల్‌లో వివాహం జరుగుతున్నట్లు సమాచారం. టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తున్నది. మెహందీ ఫంక్షన్‌తో పెళ్లి సంబరాలు మొదలవనున్నాయి.

పెళ్లి రోజే రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాక్‌. సీమా ఛాహల్‌ అనే యువతిని పెళ్లాడనున్నారని, ఆమె వృత్తిరీత్యా టీచర్‌గా పని చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే, పెళ్లి జరిగే తేదీ వివరాలు మాత్రం తెలియరాలేదు. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సందర్భంగా కబీర్‌సింగ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కెరీర్‌లో మంచి అవకాశాలతో పాటు విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.

Exit mobile version